పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!

ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు.

అసలు విషయంలోకి వస్తే, సినీ నటుడు అలీ నిర్వహిస్తోన్న ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అనసూయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇదిగో అక్కడే వచ్చింది అసలు చిక్కు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సాంగ్ ఆఫర్ వదులుకోవడంపై. ‘ఆ పాటని వదులుకోవడానికి రెండు కారణాలున్నాయ్.. అని చెబుతూ… ఒకటి, ఫోకస్ నా మీదే పూర్తిగా వుండాలని అప్పట్లో అనుకున్నాను.. అని, ఇక రెండో రీజన్.. గురించి చెబుతూ… నేను అప్పటికి ఆరు నెలల గర్భవతిని.. ఈ రెండు కారణాలవలనే అందులో చేయలేకపోయాను మహాప్రభో… అంటూ సెలవిచ్చింది అనసూయ.

అయితే చివరలో ‘థాంక్ గాడ్.. ఆ సాంగ్ వదులుకున్నందుకు మంచిదైంది’ అని కొసమెరుపుగా చెప్పింది. అదిగో అక్కడే మొదలైంది ఇంకో రచ్చ. ఈ విషయం టీవీలలో టెలికాస్ట్ అవడంతో అనసూయ మళ్ళీ ట్రోలర్స్ కంటపడింది. ‘పవన్ కళ్యాణ్ సినిమాకే నో చెబుతావా.?’ అంటూ ఇంకోసారి అనసూయ మీద ట్రోలింగ్ షురూ అయ్యింది. విషయం పాతదే.! కాకపోతే, కొత్తగా ఇంకోసారి వివాదం రాజుకుంది. తనను టార్గెట్ చేసేవాళ్ళ మీద కేసులు పెడతాననడమే కాదు, పెట్టేసింది కూడా. సో, అనసూయని ఎవరైనా ట్రోల్ చేయడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మరి.!

Share post:

Latest