ఇండస్ట్రీ అంటే అంతే, ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి.. తప్పదు: అనసూయ భరద్వాజ్

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తెలుగు కుర్రకారుకి అవసరం లేదు. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. అందుకే ఆమె బుల్లితెర నుండి వెండితెరమీదకు వెళ్లి తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్‌ అనే కామెడీ షోతో అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటివలె ఆమె ఈ షోకు గుడ్‌బై చెప్పి పూర్తిగా సినిమాలకు పరిమితమైంది.

ఈ క్రమంలో రిసెంట్‌గా ఆమె ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనపై వేసే పంచులు, బాడీ షేమింగ్‌ వల్లే తాను ఈ కామెడీ షోను వీడినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. అనంతరం ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ కంటతడి పెడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే అందరికీ అలుసే. ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత ఇక్కడ చాలా తక్కువ. హీరోయిన్‌ కేవలం ఇక్కడ కెమరా ముందు సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా.. సేమ్‌ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది.” అని అంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ… ఇక్కడ మహిళల హక్కుల కోసం మాట్లాడితే తొక్కేస్తారు. హీరోయిన్‌ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు. కానీ ఇది చాలా దారుణమైన పరిణామం. ఈ వ్యవస్థ మారాలి. అప్పుడే స్త్రీకి ఇక్కడ మనుగడ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ రంగుల ప్రపంచ వేరు. బయటకు కనిపించినంత హుందాగా ఉండదు. అసలు మేము చేసే సినిమాలు ఒక్కోసారి మేము చూసి మేమే నవ్వు కుంటాం. ప్రేక్షకులకు మాగురించి తెలిస్తే అస్సలు సినిమాలే చూడరు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Share post:

Latest