నోరు జారిన రష్మిక.. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన రష్మిక ఏ క్షణాన తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో, ఇక ఆమె దశ తిరిగింది. నాగశౌర్య సరసన ఆమె తెలుగులో చేసిన తొలి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ఆమె కెరీర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో హీరో విజయ్‌తో ఆమె స్నేహం కుదిరింది. ఈ క్రమంలో ఈ జంట మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలోనూ నటించారు. ఇవే కాకుండా నేచురల్ స్టార్ నాని సరసన నటించిన దేవదాస్, ఆపై సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే, అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియాలో హీరోతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన ఆమె ఫుల్ బిజీగా ఉంది. రెండేళ్ల పాటు తెలుగు సినిమాలకు డేట్స్ కూడా ఖాళీ లేవు. సౌత్‌లో తమిళ హీరో విజయ్ సరసన మాత్రమే ఆమె నటిస్తోంది. ఇంతలా ఆమె కెరీర్ పీక్స్‌కు చేరుకోవడానికి కారణం అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాకే కారణం అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్‌పై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌లో అల్లు అర్జున్ నటించాడు.

కంప్లీట్‌గా మునుపెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో, నెరిసిన గడ్డం, చెవులకు పోగులతో దర్శనమిచ్చాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక స్పందించింది. మీరు అల్లు అర్జున్ అంటే నమ్మలేకపోతున్నాను సార్ అంటూ సోషల్ మీడియాలో ఆమె కామెంట్ చేసింది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నెలల పాటు పుష్ప సినిమాలో నటించినా, ఆయనను గుర్తు పట్టకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఓవర్ యాక్షన్ అంటూ నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest