ఇంద్ర సినిమాలో ఆయ‌న ఎందుకు న‌టించ‌లేదు… ప‌రుచూరి చెప్పిన సీక్రెట్‌..!

చిరంజీవి నటించిన ఇంద్ర వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ నటించకపోవడానికి పలు కారణాలను తెలియజేయడం జరిగింది. ఇంద్ర సినిమా విడుదల అయి ఇప్పటికి 20 సంవత్సరాల పైనే అవుతోంది.ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మనసులో ఉండే విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా చేయడానికి మొదట డైరెక్టర్ బి గోపాల్ , నిర్మాత అశ్విని దత్ ఒప్పుకోలేదట.. అయితే కేవలం చిరంజీవి చెప్పడం వల్ల ఈ సినిమాని అంగీకరించారని తెలిపారు గోపాలకృష్ణ.Megastar Chiranjeevi's Industry Hit Indra Completes 18 years

ఇంద్ర సినిమా చేయకపోయి ఉంటే మేము ఇప్పుడు ఇంతటి వైభవాన్ని అనుభవించే వాళ్ళము కాదని తెలిపారు. దాంతో ఎన్నో సంవత్సరాలు పాటు చిరు అభిమానులు తమని గుండెల్లో చెరగని ముద్రగా వేసుకున్నారని తెలిపారు. అయితే ఇంద్ర సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడానికి ముఖ్య కారణం చిన్ని కృష్ణ అందించిన కథ అని తెలిపారు. ఇక తర్వాత పలుచూరు బ్రదర్స్ డైలాగ్స్.బి గోపాల్ దర్శకత్వ ప్రతిభ కారణంగానే చిరంజీవి నటనకు ఆ సినిమా అంతలా విజయం అయిందని తెలిపారు. అయితే గత సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల మాదిరి పాత్ర చిత్రీకరణ కాస్త ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలాంటిది చేస్తే ఏమవుతుందో అని డైరెక్టర్ వద్దన్నట్లుగా తెలిపారు.Paruchuri Gopala Krishna's advice to Pawan Kalyan

అయితే చిరంజీవి మాత్రం కథ బాగుంది ఈ సినిమా వదులుకోవడం తనకి ఇష్టం లేదని.. ఆలోచిస్తూ నాకు కు ఫోన్ చేసి ఏం చేయమంటారండి అని అడిగారట.. దానికి నేను సమాధానమిస్తూ.. వారిద్దరూ లేకుండా కేవలం చిన్ని కృష్ణను తీసుకువచ్చి రేపు నన్ను కలవండి అని చెప్పారు చిరంజీవి.. ఇక మరునాడు చిరు నీ వెల్లి కలిసి కథ కూడా చెప్పాము. ఫస్ట్ ఆఫ్ కాగానే ఆయన కుర్చీలో నుంచి లేచి ప్రశాంతంగా కిల్లి వేసుకొని ఇక సెకండ్ హాఫ్ ఇనక్కర్లేదు సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అలాగే చిరంజీవి కథ విన్నాను సినిమా హిట్ అవుతుంది చేద్దామని బి. గోపాల్ కి అలాగే అశ్విని దత్ కి కూడా చెప్పారు. ఇక అలా సినిమా మొదలైంది. ఇకపోతే సమరసింహారెడ్డి , నరసింహనాయుడు తరహాలోనే ఇంద్ర సినిమాను తెరకెక్కించినప్పటికీ ఇందులో ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయ్యిందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

Share post:

Latest