చిరంజీవి, ర‌వితేజ‌కు నాని ఇంత షాక్ ఇచ్చాడేంటి…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, రవితేజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ కూడా స్వయం కృషితో ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో తమకంటూ ఒక మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది .ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ వేగంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన నాని రవితేజ పై అలాగే చిరంజీవిపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ లు చేయడం గమనార్హం. ఇక రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ తో పాటు రజీషా విజయన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అంతేకాదు శరత్ మండల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.Highlights: Ramarao On Duty Pre-release event - TeluguBulletin.com

ఇకపోతే నాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పురస్కరించుకొని.. మాట్లాడుతూ.. నేను వచ్చింది ముఖ్యఅతిథిగా కాదు.. రవన్న గురించి మాట్లాడేది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అంటూ రవితేజ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు నాని. ఇకపోతే రవి అన్న తన కెరియర్ స్టార్ట్ చేసే సమయంలో చిరంజీవి గారిని ఎలా అయితే స్ఫూర్తిగా తీసుకున్నారో.. మా జనరేషన్లో నా కెరియర్ స్టార్ట్ చేసే సమయంలో నేను కూడా రవి అన్న ను అంతే ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను అంటూ నాని చెప్పడంతో అక్కడ ఉన్న వేడుకంత చాలా ఘనంగా చప్పట్లతో మారుమ్రోగింది.Ravi Teja's Rama Rao On Duty Movie Pre Release Event - Gallery Set 2 -  Social News XYZ

రవితేజ అన్న చిరంజీవి గారి క్యారవాన్ లో వెళ్లే సీన్ చూసా.. ఎంతో బాగుంది.. త్వరలోనే నేను కూడా అడుగు పెట్టాలనుకుంటున్నాను అంటూ నాని చెప్పడం విశేషం. ఇకపోతే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక విడుదల చేసిన అన్ని అప్డేట్స్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలాగా కనిపిస్తున్నాయి అంటూ నాని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు .ఇక టీజర్ , ట్రైలర్ చూశాక నా నమ్మకం మరింత బలంగా పెరిగిందని చెబుతూనే ఇంకొక వైపు నాని చేసిన వ్యాఖ్యలపై అటు రవితేజ ఫాన్స్ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరు స్టార్ హీరోల గురించి ఈ స్టార్ హీరో ఇలా మాట్లాడడం చూసి షాక్ తిన్న అభిమానులు ఆ తర్వాత తేరుకొని సంతోషంలో ఊగిపోతున్నారు.