బాలీవుడ్‌ను కుమ్మి కుమ్మి వ‌దిలిన ఆ తెలుగు హీరోయిన్ ఎవ‌రంటే..?

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి పేరు పొందింది హీరోయిన్ లక్ష్మి. అయితే ఈమె ఓ బేబీ చిత్రంతో యువతకి కూడా బాగా దగ్గర అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సమంతతో ఈమె చేసే అల్లరి చాలా ఆకట్టుకుంది. ఈమె ఒకేసారి తెలుగు , తమిళం , కన్నడ , హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఈమె సొంత ఊరు నెల్లూరు. ఈమె పేరు మహాలక్ష్మి అయితే ఈమె తల్లితండ్రులు అందరూ కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో ఈమె చెన్నైలోనే స్థిరపడడం జరిగింది.Veteran actress Lakshmi looks forward to 'Oh! Baby' and 'Manmadhudu 2', and talks about how cinema gave her freedom - The Hinduఈమె ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. హీరోయిన్ లక్ష్మి సినీ ప్రయాణం తమిళ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత పలు భాషలలో కూడా నటించింది. హిందీలో నటించిన మొదటి చిత్రం జూలీ తో ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకున్నది లక్ష్మి. అలా మొదటిసారి బాలీవుడ్లో అవార్డు అందుకున్న తెలుగు నటి గా గుర్తింపు దక్కించుకుంది. ఈమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయింది.Aishwarya: డబ్బులు కావాలి .. పాచి పని అయినా చేస్తా.. సీనియర్ హీరోయిన్ ఆవేదన - NTV Telugu

ఇక పలు సినిమాలలో తల్లి పాత్రలలో అలాగే విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించింది. తన కెరియర్ లో మాత్రం బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రం మిధునం. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పక్కన నటించింది. ఈమె నటన కూడా ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇక ఆ తరువాత సమంత, రాజేంద్రప్రసాద్ ముఖ్యమైన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రంలో కూడా ఈమె చాలా చక్కగా నటించింది. ప్రస్తుతం ఈమెకు సరిగ్గా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కూతురు అయిన ఐశ్వర్య కూడా జీవనాధారం కోసం సబ్బులు అమ్ముకుంటూ జీవం సాగిస్తున్నామని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఎన్నో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్ లక్ష్మి కుటుంబ పరిస్థితి ఇలా ఉండడంతో ఆమె అభిమానుల సైతం చాలా బాధపడుతున్నారు.

Share post:

Latest