ఇంస్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ సంపాదన అన్ని కోట్లా..?

విరాట్ కోహ్లీ.. దేశం గర్వించదగ్గ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ గా బ్యాట్స్ మ్యాన్ గా మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగినన్ని రోజులు కూడా ఒక అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు . ముఖ్యంగా కోచ్ ను ఎంపిక చేయడం దగ్గరనుంచి జట్టు సెలక్షన్ వరకు అన్నిట్లో కూడా కోహ్లీ కీలకపాత్ర పోషించేవాడు. కానీ పోయిన సంవత్సరం T20 వరల్డ్ కప్ లో జరిగిన దారుణమైన పరాభవం తర్వాత జట్టు నుంచి కెప్టెన్ బాధ్యత నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. ఇక కెప్టెన్ పదవిని కోల్పోయిన తర్వాత వన్డే , టెస్ట్ జట్టు లో కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లీని తప్పించడం జరిగింది. ఇప్పుడు బ్యాట్స్ మ్యాన్ గా కొనసాగడానికి విరాట్ కోహ్లీ ఇబ్బంది పడడంతో పాటు అప్పటి ఫేం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.Balancing cricketing and endorsements easily doable: Kohli - myKhel

ఇకపోతే విరాట్ కోహ్లీ క్రికెట్లో ప్రస్తుతం తన ప్రతిభను చూపించలేకపోయినప్పటికీ సంపాదనలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆసియా లోనే అధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీ జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా ..ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ జాబితాలో 14వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే విరాట్ కోహ్లీకి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తాజాగా హపర్ HQ అనే సంస్థ 2022 కు సంబంధించిన ఇంస్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితా ప్రకారం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కి 10.88 లక్షల డాలర్లను సంపాదిస్తున్నాడని సమాచారం. అదే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఇంస్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు ఏకంగా రూ.8.69 కోట్లు సంపాదిస్తున్నాడు అన్నమాట.