ఇండియాలోనే ఫస్ట్ టైం..కొత్త రకం బ్లడ్ గ్రూప్ ను గుర్తించిన డాక్టర్లు..!!

యస్.. ఇది నిజమే. ఈ విషయాని డాక్టర్లు అధికారికంగా ధృవికరించారు. సాధారణంగా మనుషుల్లో రక రకలా బెడ్ గ్రూప్స్ కలిగిన వారు ఉంటారు. A, B,AB,O పాజిటివ్.. నెగెటివ్ అని..ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. మనం కూడా ఇలాంటి గ్రూప్స్ పేరే విని ఉంటాం. కానీ, ఇప్పుడు మరో కొత్త బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు డాక్టర్లు. అది కూడా మన ఇండియాలో. రేర్ బ్లడ్ గ్రూప అయిన ‘ఈఎంఎం నెగిటివ్’ ని గుజరాత్ లోని ఓ వ్యక్తిలో గుర్తించారు వైద్యులు.

పూర్తి వివరాలోకి వెళ్లితే .. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌కు చెందిన 65 ఏళ్ల ఓ వ్యక్తి కి గుండె లో సమస్య ఉంది. దీంతో చాలా కాలం నుండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నయం కాలేదు. దీంతో డాక్టర్లు సర్జరీ అవసరం అని చెప్పారు. దీని కోసం బ్లడ్ టెస్ట్ చేయగా.,డాక్టలు షాక్ అయిపోయారు. ఆయన బ్లడ్ రిపోర్ట్స్ చూసి ఆశ్చర్య పోయారు. ఎందుకంటే..ఈయనది అందరి మనుషుల్లో ఉన్న బ్లడ్ గ్రూప్ కాదు. ప్రపంచంలోనే రేర్ బ్లడ్ గ్రూప్. అస్సలు ఇప్పటి వరకు ఇలాంటి బ్లడ్ గ్రూప్ కలిగిన వారు 9 మందే ఉన్నారు.

ఇప్పుడు ఈయన తో కలుపుకుని మొత్తం 10 మంది అయ్యారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా త‌క్కువ మందికే తెలిసిన బ్ల‌డ్ గ్రూప్ మాత్ర‌మే కాదు, చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉండే బ్ల‌డ్ గ్రూప్ కూడా. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఈఎంఎం నెగిటివ్ అని నామకరణం చేసింది. ‘ఈఎంఎం నెగిటివ్’ అనే ఈ బ్లడ్ గ్రూప్ మనుషుల్లో చాలా అరుదుగా ఉంటుందట. ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు.. ఎవరి దగ్గరినుండి పొందలేరు అని డాక్టర్లు చెప్పుతున్నారు.

Share post:

Latest