థాంక్యూ తో సహా దిల్ రాజు సినీ కెరియర్ను తలకిందులు చేసిన మూవీస్ ఇవే..!

నాగార్జున వారసుడు నాగచైతన్య హీరోగా.. బబ్లీ గర్ల్ రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం థాంక్యూ.. ఈ సినిమాతో ఎలా అయినా సరే నాగచైతన్యకి మంచి విజయాన్ని అందించాలని దిల్ రాజు ఎన్నో కలలు కన్నాడు. అంతే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నాడు. కానీ దిల్ రాజు ఆశలన్నీ అడియాశలు అయ్యాయని చెప్పవచ్చు. జోష్ సినిమాతో నాగచైతన్యను దిల్ రాజు హీరోగా పరిచయం చేసినప్పటికీ అప్పట్లో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు థాంక్యూ సినిమాతో కచ్చితంగా నాగచైతన్యకు విజయం అందించాలనుకున్నా.. ఎక్కడో బెడిసి కొట్టిందని.. ఈసారి కూడా నాగార్జున మాటను నిలబెట్టలేకపోయాడు. ఇక ఈసారి కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే థాంక్యూ సినిమా తో సహా దిల్ రాజు సినీ కెరియర్లో ఎన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తరికెక్కించిన మున్నా సినిమాతోనే మొదటి డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు దిల్ రాజ్. ఇక తర్వాత ఆకాశమంత , రామ రామ కృష్ణ కృష్ణ, మరోచరిత్ర, గగనం, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాలతో నిర్మాతగా ఈయనకు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. శ్రీనివాస కళ్యాణం, రామయ్య వస్తావయ్య , లవర్, రౌడీబాయ్స్, ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాలు కూడా భారీ డిజాస్టర్ గా మిగిలి ఆయనకు కమర్షియల్ గా భారీ దెబ్బతీసాయి. ఇప్పుడు థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతగా మరొకసారి దిల్ రాజును దెబ్బతీసింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలతో నిర్మాతగా తన కెరియర్ పూర్తిగా తలకిందులైందని చెప్పడంలో సందేహం లేదు.