వెంక‌య్య‌కు రెన్యువ‌ల్ లేదు.. తెర‌వెనుక ఓ సీఎం చ‌క్రం తిప్పారా…!

తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కేంద్రం అవ‌మానించిందని.. ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. ఇటు రాజ‌కీ యంగా.. అటు రాజ్యాంగం ప‌రంగా కూడా ఆయ‌న ఇక‌, సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరిపోయార‌ని ఒక చ‌ర్చ జ‌రు గుతోంది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చ‌క్రం తిప్పార‌ని..కూడా భావిస్తున్నారు.

 

ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌.. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నాయకులు. కేంద్రంలో మంత్రిగా, ఎంపీగా.. ఆయ‌న సుదీర్ఘ కాలం సేవ‌లు అందించారు. అయితే.. గ‌త ఐదేళ్ల కింద‌ట ఆయ‌న‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి హోదా ద‌క్కింది. ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌న‌నురాష్ట్ర‌ప‌తిగా పంపిస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. అది మిస్స‌యిపోయింది. దీంతో క‌నీసం.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా అయినా.. ఆయ‌న‌ను రెన్యువ‌ల్ చేస్తార‌ని అంద‌రూ భావించారు. ఎందుకంటే.. కేంద్రంతో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు అలాంటివి.

కానీ, తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తిగా కూడా ఆయ‌న‌కు అవ‌కాశం చిక్క‌లేదు. అయితే.. దీనివెను క ఎలాంటి కార‌ణాలు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఒక ముఖ్య‌మంత్రికి, ఉప‌రాష్ట్ర‌ప‌తికి మ‌ధ్య రాజ‌కీయంగా.. సామాజిక వ‌ర్గం ప‌రంగా విభేదాలుఉన్నాయ‌ని.. ఆయ‌న‌కు ఒక ప్ర‌తిప‌క్ష పార్టీతో అనుబంధం ఉంద‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీ ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు ఆయ‌న సాయం చేస్తున్నార‌ని.. ఆయ‌న ను ప‌క్క‌కు త‌ప్పిస్తే.. ప్ర‌తిప‌క్ష పార్టీ దూకుడు త‌గ్గుతుంద‌ని.. స‌ద‌రు సీఎం లెక్క‌లు వేసుకున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే కేంద్రంతో స‌దరు సీఎంకు ఉన్న అనుబంధాన్ని అడ్డం పెట్టుకుని.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంకయ్య‌ను పక్క‌న పెట్టాల‌నే.. ఒత్తిడి తెచ్చార‌ని.. కేంద్రం కూడా వెంక‌య్య‌ను ప‌క్కన పెట్టాల‌ని అప్ప‌టికే నిర్ణ‌యించుకోవ‌డం.. తెలుగు రాష్ట్రాల సీఎం నుంచి కూడా అభ్య‌ర్థ‌న‌లు ఒత్తిళ్లు రావ‌డంతో.. వెంక‌య్య‌కు ఉద్వాస‌న ప‌లికార‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆయ‌న‌ను త‌ప్పించ‌డం ద్వారా.. ప్ర‌తిప‌క్షంపై మ‌రింత ప‌ట్టు పెంచుకోవ‌చ్చని స‌దరు సీఎం భావిస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో.. కొన్నాళ్లు ఆగితే త‌ప్ప తెలియ‌దు.