విజయం కావాలంటున్న ‘వారసుడు’!

సీనియర్ లేదు…జూనియర్ లేదు…గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు…టీడీపీలో ఉన్న నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే…జగన్ వేవ్ తట్టుకుని 23 మందే గెలిచారు…మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగి…చాలామంది వారసులు సైతం ఓటమి పాలైన విషయం తెలిసిందే…ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదనే చెప్పాలి.

అలా ఓటమి పాలైన వారసులు ఈ సారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవకపోతే తమ రాజకీయ భవిష్యత్ సైతం ప్రమాదంలో పడిపోతుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ గెలుపు కోసం దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. కాగిత ఫ్యామిలీ ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. తన చివరి నిమిషం వరకు కాగిత వెంకట్రావు టీడీపీలో ఉన్నారు.

పలుమార్లు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన…తన చిరకాల కోరిక మంత్రి పదవి మాత్రం రాలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవిపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు..కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా ఆయనకు పదవి రాలేదు. ఇక నిదానంగా అనారోగ్యం పాలవ్వడంతో కాగిత ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు…2019 ఎన్నికల్లో కాగిత తప్పుకుని, తన తనయుడు కృష్ణప్రసాద్ కు పెడన సీటు ఇప్పించుకున్నారు.

అయితే రాజకీయాలపై కృష్ణప్రసాద్ కు పట్టు లేదు…పైగా జగన్ వేవ్ ఉంది…అలాగే జనసేన ప్రభావం ఉంది…దీని వల్ల కృష్ణప్రసాద్ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు..ఈ సారి గాని గెలవకపోతే మొదట్లోనే రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని చెప్పి…నియోజకవర్గంపై పట్టు తెచ్చుకుని, రాజకీయంగా బలపడుతూ వస్తున్నారు. నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉన్నా, లేకపోయినా గెలవడం మాత్రం ముఖ్యమని భావించి పనిచేస్తున్నారు.

ప్రస్తుతం పెడనలో నడుస్తున్న రాజకీయం బట్టి చూస్తే కాగిత వారసుడుకు కాస్త అనుకూలమైన వాతావరణమే ఉంది..పైగా కాగిత సెంటిమెంట్ కూడా ఉంది. అదే సమయంలో నెక్స్ట్ జనసేన మద్ధతుగాని ఉంటే…డౌట్ లేకుండా కృష్ణప్రసాద్ గెలవడం ఖాయమని తెలుస్తోంది. మరి చూడాలి కాగిత వారసుడుకు మొదటి విజయం దక్కుతుందో లేదో.