డిఫెరెంట్ ఫీమేల్ ఓరియెంటెడ్ లో తమన్నా… అదిరిపోయిన టైటిల్!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దకాలం తరువాత కూడా తన హవా కొనసాగుతుందంటే ఆమె టాలెంట్ ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. అందం, అభినయం, నృత్యం కలగలసిన హీరోయిన్ తమన్నా. తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అగ్ర హీరోల అందరితో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం ఆమె ఫోకస్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది. సినిమాలలో మంచి ప్రాధాన్యత దొరికిన పాత్రలను మాత్రమే చేయాలని తమన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతుంది.

తాజా సినిమా టైటిల్ ఇదే:

త్వరలో ఒక సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ప్రాజెక్టుతో తమన్నా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ఎవరు కూడా పెద్దగా ట్రై చేయని బౌన్సర్ తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పేరు కూడా ‘బౌన్సర్ బాబ్లీ’నే. స్టార్ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా సెక్యూరిటీగా బౌన్సర్స్ ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఎక్కువగా మగవాళ్ళు ఉంటుంటారు. కానీ ఈసారి ఒక అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది. ఇక అందులో కూడా అందమైన అమ్మాయి మరింత పవర్ఫుల్గా కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది అనే తరహా సినిమాలో చేయబోతోంది.

సినిమా విశేషాలివి:

దర్శకుడు మధుర్ భండార్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను స్టార్ స్టూడియోస్ జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక బాబ్లీ బౌన్సర్ 23 సెప్టెంబర్ 2022న డిస్నీ+ హాట్స్టార్లో హిందీ తమిళం మరియు తెలుగులో విడుదల కానుంది. ఇక తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. నార్త్ ఇండియాలో నిజమైన ‘బౌన్సర్ టౌన్’ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఒక కామెడీ డ్రామాగా ఈ సినిమా రానుందట. అసోలా ఫతేపూర్ గా తమన్నా భాటియాను బాబ్లీ బౌన్సర్గా మునుపెన్నడూ చూడని లోక్ చూస్తారట.