కృష్ణకి మొదటి భార్య కంటే రెండవ భార్య అంటేనే ప్రేమ ఎక్కువా?

టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. NTR, ANR హవా కొనసాగుతున్న రోజుల్లో తనదైన మార్కు క్రియేట్ చేసుకున్న ఏకైన కట్టుడు అని చెప్పుకోవాలి. కృష్ణ అంటే అప్పట్లోనే ప్రయోగాలకు పెట్టింది పేరు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి హాలీవుడ్ రేంజ్ సినిమాలను పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం. ఇక ఆయన ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, హీరోయిన్ అయినటువంటి విజయనిర్మలతో చేసిన సినిమాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య సాన్నిత్యం ఏరపడి, మొదటి భార్య ఇందిరను ఒప్పించి మరీ కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరు ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఈ నేపథ్యంలో మొదటి భార్యకంటే రెండవ భార్యతోనే ఎక్కువ సఖ్యతతో ఆయనకు ఉందనే గుసగుసలు వినిపించేవి. అయితే వాటిని రుజువు చేసినట్లయింది ఇటీవల చేసిన ఓ హోమ్ టూర్. అవును.. ఈ మధ్య హోమ్ టూర్ల హవా ఎక్కువగా నడుస్తోంది. కొందరైతే ఏకంగా తమ యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తూ రెండు చేతులా బాగా సంపాదిస్తున్నారు. ఇక మరి కొంతమంది డబ్బు కోసం కాకుండా తమ భావాలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇలా హోమ్ టూర్స్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మన సూపర్ స్టార్ కుమార్తె మంజుల తన తండ్రి హోమ్ టూర్ ని చేసింది. అందులో భాగంగానే విజయనిర్మలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలికి వచ్చాయి. విజయనిర్మల అంటే కృష్ణగారికి ఎంతో అమితమైన ప్రేమ. అందుకే ఈమెకు సంబంధించిన ఏ చిన్న వేడుకనైనా సరే చాలా ఘనంగా జరిపించేవారట. ఇక ఆమె మరణం తర్వాత ఆయన బయటికి రావడమే లేదట. ఇక ఆమె జ్ఞాపకార్థం విజయనిర్మల కాంస్య విగ్రహం వెలుగులోకి వచ్చింది. విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణకు రెండో భార్యపై ఎంత ప్రేమ ఉంటే ఇలా విగ్రహం చేయిస్తాడు అంటూ చెప్పుకుంటున్నారు.

Share post:

Latest