సింగిల్ అన్న కరణ్.. అలాంటి ప్రపోజల్ కు ఒప్పుకున్న సమంత..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టినా.. ఇక్కడ మాత్రం వరుస సినిమాలు చేస్తూ పోతుంది. ఇకపోతే సమంత – నాగచైతన్యను ప్రేమించే వివాహం చేసుకున్నప్పటికీ.. వారి వైవాహిక బంధం చాలా రోజులు కొనసాగలేక పోయింది. ఇకపోతే భర్తకు దూరమైన తర్వాత తన సినీ కెరియర్లో బిజీగా మారి ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన నటించిన అవకాశాన్ని సొంతం చేసుకున్న సమంత బాలీవుడ్లో మరింత పాపులర్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఈ క్రమంలోనే ప్రముఖ సెలబ్రిటీ షో అయినటువంటి కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను అలాగే నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా బయటపెట్టింది. ఇక ఈ ప్రోగ్రాం లో భాగంగానే సమంత చేసిన వ్యాఖ్యలు అభిమానులను తీవ్రస్థాయిలో హర్ట్ చేస్తున్నాయి. ఇకపోతే ప్రశ్నలలో భాగంగానే కరణ్ మీ భర్త నాగ చైతన్య అని చెప్పగానే ఆమె మధ్యలో అడ్డుకొని భర్త కాదు మాజీ భర్త అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అంతేకాదు తనను, నాగచైతన్యను ఒకే గదిలో ఉంచితే కత్తులు కటార్లు లేకుండా చూసుకోమని కూడా ఆమె చెప్పింది.

ఇక చివరిగా కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ..” నువ్వు సింగిల్.. నేను సింగిల్.. ఇద్దరం కలిసి జాలీగా వెకేషన్ కి వెళ్దామా” అంటూ ప్రపోజల్ పెట్టాడు. మొదట్లో సమంత కరణ్ ప్రపోజల్ కు నో చెప్పినా ఆ తర్వాత మాత్రం ఎస్ అని చెప్పింది .ఇక వీరిద్దరూ వెకేషన్ కి వెళ్తారో లేదో తెలియాల్సి ఉంది. ఇకపోతే సోషల్ మీడియాలో సమంత ఘోరం, నాగచైతన్య బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. అంతేకాదు క్రేజ్ ఉందని అహంకారంతో సమంత ఇలా మాట్లాడుతోందని మరికొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Share post:

Latest