‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?

సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ కూడా కొడుకుకు ప్రేమను పంచదు. అంతటి ఎమోషనల్ మూవీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో నటించిన రాజశేఖర్ కు ఈ సినిమా మంచి విజయంతోపాటు మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చి పెట్టింది. అయితే ఈ స్టోరీని మొదట రాజశేఖర్ తో అనుకోలేదట దర్శకుడు వి. సముద్ర. ఈ సినిమాను పూర్తిగా నందమూరి బాలయ్యను బేస్ చేసుకొనే రాశాడట. ‘సమర సింహారెడ్డి’ వంటి ఫక్తు కమర్షియల్ సినిమా తరువాత ‘సింహరాశి’ కథను పూర్తి చేసి బాలయ్య వద్దకు వెళ్ళాడట దర్శకుడు వి. సముద్ర. కానీ ఈ కథను బాలయ్య రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే సమర సింహారెడ్డి తర్వాత బాలయ్య ‘చెన్న కేశవరెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి ఫ్యాక్షన్ పవర్ ఫుల్ కథలనే బాలయ్య ఓకే చేసాడు.

‘సింహరాశి’ మరీ సెంటిమెంటల్ సినిమా అని.. చెన్నకేశవరెడ్డిని తనతో తీయాలని విన్నవించాడట.. కానీ సముద్ర దాన్ని తిరస్కరించాడట. ఇక చెన్నకేశవరెడ్డి కథను తయారు చేసిన వివి వినాయక్ తోనే బాలయ్య ఆ సినిమా తీశాడు. ఇక తదనంతరం ‘సింహరాశి’ మూవీ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆ ఏమోషనల్ మూవీ సముద్ర-రాజశేఖర్ లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ బాలయ్య ఈ మంచి సినిమా మిస్ చేసుకున్నానని అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుంటాడట.

Share post:

Popular