అసలైన బింబిసారుడు రవితేజానా..ఇదేం ట్వీస్ట్ రా మావ..!!

యస్..లెటేస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం బట్టి ఇది నిజం అని చెప్పక తప్పదు. అసలు బింబిసారుడు అనే పేరు చాలా తక్కువ మందికే తెలుసు . ఏదో నందమూరి హీరో కల్యాణ్ రామ్ పుణ్యమా అంటూ..ఇప్పుడు ఆ పేరుని మనం వింటున్నాం కానీ, ఈ సినిమా అనౌన్స్ చేయకముందు ఈ పేరు విన్న వారు చాలా తక్కువ. అయితే, కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన్నప్పుడే సినిమా ఏదో కొత్త గా ఉండబోతుందని జనాలు పసికట్టెశారు . అనుకున్న విధంగానే సినిమాలో మ్యాటర్ చాలా ఉందని ట్రైలర్ బట్టి అర్ధమైపోయింది.

టైం ట్రావెల్ కధతో మన ముందుకు వస్తున్న కళ్యాణ్ రాం ఈ సినిమా తో హిట్ కాదు..బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగ రాయడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే, ఈ సినిమా కధకి ముందు అనుకున్న హీరో కళ్యాణ్ రామ్ కాదట. షాకింగ్ గా ఉన్న ఇది నిజం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ అద్భుతమైన కధ ముందు వెళ్లింది హీరో రవి తేజ దగ్గరకట, కానీ రవితేజ..”నాకు ఇలాంటి సినిమాలు సూట్ కావు. మంచి మాస్ స్టోరీ తో రండి..” అంటూ డైరెక్టర్ వశిష్ట కి చెప్పారట. దీంతో ఆయన్ సెకండ్ ఆప్షన్ క్రింద కళ్యాణ్ రామ్ కలవడం..ఆయన స్టోరి విని ఇంప్రెస్ అయ్యి..సినిమాకి కమిట్ అవ్వడం జరిగిపోయింది.

 

అఫ్ కోర్స్..కల్యాణ్ రామ్ తప్పిస్తే ఆ ప్లేస్ లో మనం ఎవ్వరిని చూసిన కనెక్ట్ అవ్వలేం. అంత బాగా సెట్ అయ్యారు ఆయన. నిజమైన బింబిసారుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయనని చూశాక అందరు..బింబిసారుడు ఇలానే ఉండేవాడు ఏమో అనుకుంటున్నారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ తన బాడీ ని మార్చుకున్నారు.. ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదివారట .. చాలా బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన హీరోయిన్ గా కేథరిన్ త్రెసా, మలయాళి బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఆగష్టు 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవనుంది. నో డౌట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.