రాపో “ది వారియర్” మూవీ..హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని..తాజాగా హీరోగా నటించిన చిత్రం ..”ది వారియర్”. రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై మొదటి నుండి అభిమానులు ఓ రేంజ్ అంచనాలనే పెట్టుకుని ఉన్నారు. లింగుస్వామీ గత ట్రాక్ రికార్డ్..రామ్ పోలీస్ ఆఫిసర్ గా..లెటేస్ట్ సెన్ సేషన్ కృతి అందాలు..సినిమా కు మంచి హైప్ ఇచ్చాయి.

కాగా, కొద్ది గంటల క్రితమే..ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ధియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా గురించి పాజిటీవ్ కామెంట్స్ చెప్పడమే కాక..సినిమా మొత్తానికి యాక్షన్ సీన్స్ నే హైలెట్ గా నిలిచాయి అంటూ సినిమా చూడని జనాలను ఊరిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ..ఫన్ గా సాగిన..రామ్ పోలీస్ యూనిఫామ్ వేసిన అప్పటి నుండి కధ వేరే లెవల్ లో ఉంటుందంటున్నారు సినిమా చూసిన జనాలు.

అంతేకాదు, ఈ సినిమా ద్వార రామ్ తన కెరీర్ లోనే ఎప్పుడు చూడని బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అభిమానులు బల్ల గుద్ది చెప్పుతున్నారు. సినిమాలో కృతి శెట్టి అందాలు బాగున్నాయని..ఈ సినిమాతో నాలుగో హిట్ తన ఖాతాలో వేసుకుందని అంటున్నారు . అంతేకాదు సినిమాలో నదియా యాక్టింగ్ సూపర్ గా ఉందని. అస్సలు కధ మొత్తం ఆమె బేస్ మీదనే నడుస్తుందని ..సినిమా చాలా చాలా బాగుందని అభిమానులు రివ్యూ ఇస్తున్నారు.

సెకండాఫ్‌ మాత్రం ఊరమాస్‌ గా సాగుతుందని, యాక్షన్‌ ఎపిసోడ్‌లు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట..అభిమానులు రివ్యూ బట్టి చూస్తే బాక్స్ ఆఫిస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పక తప్పదు, మరి చూడాలి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

Share post:

Latest