బింబిసారుడిగా ఇరగదీసిన కళ్యాణ్‌రామ్‌..మాసివ్ ట్రైలర్ తో నట విశ్వరూపం చూపించాడుగా(వీడియో) ..!!

కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ నే ఈ బింబిసారా మూవి. టైటిల్ తోనే అభిమానులో ఓ కొత్త ఊపు అందించిన కళ్యాణ్ రామ్..సినిమా కు సబంధించిన క్రేజీ అప్ డేట్స్ లో నిరంతరం అభిమానులో సినిమా పై అంచనాలను పెంచేస్తున్నారు. బింబిసారుడిగా ఈ సినిమా లో మనం కళ్యాణ్ రామ్ ని చూడబోతున్నాం. ఇప్పటికే సినిమా కి సంబంధించిన అన్ని అప్ డేట్స్ తో అభిమానులు ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ తో..అభిమానులకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

నందమూరి కల్యాణ్ రామ్ కేరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న మూవీ ‘బింబిసార’ సినిమాకు సంబంధించిన రెండో టైలర్ ను కొద్ది సేప్పటి క్రితమే NTR రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది వరకే రిలీజ్ అయిన టైలర్‌లో కల్యాణ్ రామ్ న్యూ లుక్ నందమూరి అభిమానులను, సినీ ప్రేమికులను కట్టిపడేసేలా చేసాయి. కాగా తాజా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ చెప్పే ప్రతి దైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

మరి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా మారి బేస్ వాయిస్ లో చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి అంటున్నారు అభిమానులు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సెకండ్ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ చెప్పిన ..”హ‌ద్దుల‌ను చెరిపేస్తూ మ‌న రాజ్య‌పు స‌రిహ‌ద్దులు ఆ పై రాజ్యాల స‌రిహ‌ద్దులు దాటి విస్త‌రించాలి” అంటూ క‌ళ్యాణ్ క‌ఠినంగా చెప్పిన డైలాగ్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి.

ఈ ‘బింబిసార’ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రంలో కేథరిన్, సంయుక్త మేనన్ కథానియికలు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఒక్క ట్రైలర్ తీ సినిమాపై సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి పెంచగా..ఇప్పుడు తాజాగా విడుదలైన టైలర్ మరిన్ని అంచనాలను పెంచేలా ఉంది. ఆగ‌స్టు 5న ఈ సినిమా గ్రాండ్ గా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయ్మ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. బింబిసారా నుండి రిలీజ్ అయిన పవర్ ఫుల్ సెకండ్ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయ్యండి..!!