దట్ ఈజ్ నందమూరి బాలయ్య..హీరోలు చూసి నేర్చుకోండయ్య..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండచ్చు..పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి నందమూరి ఫ్యామిలీ ది ఓ ఢిఫరెంట్ మైండ్ సెట్ అని చెప్పాలి. జనాల కోసం పని చేయడం..అభిమానులను ఉత్సాహ పరచడం..ఎంటర్ టైన్ చేయడం ఈ ఫ్యామిలీకి ఉన్న పెద్ద మంచి గుణం. జనరల్ హీరోలు డబ్బులు కోసం సినిమాలు చేసి..చేతికి వచ్చిన క్యారెక్టర్లు చేసుకుని పారితోషకం పుచ్చుకుని వెళ్లిపోతుంటారు. జనాల కోసం సినిమాలో నటించే హీరోలు చాలా తక్కువ ..ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు..నందమూరు నట సింహం బాలయ్య.

అఫ్ కోర్స్ నాన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి. జనాల కోసం అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్ని మంచి పనులో చేసారో ..కొత్త పధకాలు ప్రవేశపెట్టారో మనకు తెలియని విషయం కాదు. ఏపి రాజకీయాలో పెను మార్పులు సృష్టించిన ఘనత NTR గారికే దక్కింది. మరి అలాంటి ఆయన కడుపున పుట్టిన నందమూరి బాలయ్య జనాలకు మంచి చేయడంలో వెనక్కి తగ్గుతారా..నో ఛాన్స్. అభిమానుల కొసం ఏమైన చేయడానికి నందమూరి హీరోలు ముందు వరుసలో ఉంటారు.

సేమ్ బాలయ్య అంతే. మనకు తెలిసిందే ప్రస్తుత్తం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుత్తం షూటింగ్ దశలో ఉంది. ప్రజెంట్ కర్నూలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను కొండా రెడ్డి బురుజు, మరియు ఇతర లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు..బాలయ్య ను చూడటానికి అక్కడికి వచ్చేశారు. భారీ సంఖ్యలో జనాలు రావడంతో చిత్ర బృందం షాక్ అయ్యింది.

ఇక షూటింగ్ బ్రేక్ లో బాలయ్య తన అభిమానులతో ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, అక్కడైకి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేసి..కడుపు నిండా అన్నం పెట్టి పంపించారు. డబ్బున్న హీరోలకు షూటింగ్ లోకేషన్స్ లో క్యారియర్లు పంపడం కాదు. ఇలా మనల్ని నమ్మి అభిమానించే జనాల కోసం చేతనైన సాయం చేయాలి..వాడే ఇండస్ట్రీకి అసలైన హీరో అంటూ అక్కడున్న వారు “జై బాలయ్య..జై జై బాలయ్య..”అంటూ అరుస్తూ..బాలయ్య పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ని సెక్యూరిటీకి చెప్పి గెంటించే హీరోలు ..బాలయ్య ను చూసి నేర్చుకోండి అంటూ..కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest