సమంతతో రొమాన్స్..నాగ చైతన్య ఆన్సర్ వింటే..దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య-సమంత..అంటే ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జంట కి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా తెర పై ది బెస్ట్ కెమిస్ట్రీ పండించడంలో వీళ్లకు లేరు సాటి అని ప్రూవ్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో ..ఆఫ్ స్క్రీన్ లవ్ ని కంటీన్యూ చేసి..పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుని.. భార్య భర్తలుగా మారారు.

కానీ, విధి ఆడిన వింత నాటకంలో వీళ్లు బలైపోయారు. విడాకులు తీసుకుని వేరు వేరు గా బ్రతుకుతున్నారు. కాగా, రీసెంట్ గా నాగచైతన్య తన సినిమా ప్రమొషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..సమంత తో రొమాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “మీకు ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ది బెస్ట్ అని ఎవ్వరు చెప్పుతారు అని యాంకర్ అడగ్గా..చైతన్య మాట్లాడుతూ..”ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది అంటే..అది ఫస్ట్ సాయి పల్లవి తోనే..ఆ తరువాత సమంత తో ..” అంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి సాయి పల్లవి తో చైతన్య రొమాంటిక్ సీన్స్ చాలా తక్కువ. వీళ్లిద్దరు కలిసి నటించింది ఒక్క సినిమాలోనే. అది లవ్ స్టోరి. ఆ కధ ఎలాంటిదో మనం చూసిందే. అదే, మనం సమంత-నాగ చైతన్య ల విషయానికి వస్తే..వాళ్ళు మూడో నాలుగు సినిమాలో కలిసి నటించారు. ఏమాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ..ఈ నాలుగు సినిమాలో ..మూడూ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

మరి సినిమా లో వాళ్ళ కెమిస్ట్రీ బాగుండక పోతేనే అంత పెద్ద హిట్ అయ్యాయా..? అంటూ సామ్ అభిమానులు చైతన్య ను ట్రోల్ చేస్తున్నారు. కాగా, సమంత రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో నాగ చైతన్య పై చేసిన వ్యాక్యలు ఎంత హాట్ గా ట్రెండ్ అవుతున్నాయో తెలిసిందే. కనీసం ఆయనని భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్ట పడలేదు సమంత.