నయా లుక్ లో నాగచైతన్య.. బాలీవుడ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడంటే..!?

అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచారు. పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలో చేస్తున్నాడు చైతూ. ఇక టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి నాగచైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా సినిమా తెరకెక్కుతోంది.

అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు పాత్రలో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఇందులో నాగచైతన్య కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాగచైతన్య బీటీఎస్ ని విడుదల చేశారు. ఇందులో సినిమాకు సంబంధించి తన పాత్ర యొక్క జర్నీని నాగచైతన్య పంచుకున్నాడు. షూటింగ్ అనుభవాలను ఇందులో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన తాత ఏఎన్నార్ నటించిన బాలరాజు సినిమా తనకు ఎంతో ఇష్టమని, ఆ పాత్ర కోసం ఆయనను స్పూర్తిగా తీసుకున్నట్లు నాగచైతన్య తెలిపాడు.

లాల్ సింగ్ చడ్డా సినిమాలోని తన పాత్రకు బాలరాజు అపే పేరు పెట్టాలని అమీర్ ఖాన్ కి చెప్పడంతో ఒప్పుకున్నారన్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. టూత్ క్లిప్ పెట్టుకుని నయా లుక్ లో కనిపించాడు. ఆ టూత్ క్లిప్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్మీ అధికారి పాత్ర కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. అలాగే హిందీ డైలాగ్ లను కూడా నాగచైతన్య చాలా బాగా చెప్పాడు.

Share post:

Latest