విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?

గత కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న హాట్ గాసిప్ ఏమంటే, నటుడు విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్ కాస్త టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి పాకడంతో పెద్ద చర్చే నడుస్తోంది. ‘గీతగోవిందం’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ – రష్మిక మంచి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, వారి కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది. ఇక బయట కూడా వీరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసినదే.


వారిని ఇరకాటంలో పెట్టింది వీరే?

ఇక అసలు విషయంలోకి వెళితే, దర్శక నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ఇటీవలే స్టార్ట్ అయిన సంగతి విదితమే. తాజాగా ఎపిసోడ్ లో బీటౌన్ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్ – జాన్వీ కపూర్ సందడి చేశారు. ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ షోలో ఎన్నో విషయాల గురించి మాట్లాడగా, “విజయ్ దేవరకొండ – రష్మిక” అనే అంశం మాత్రం ఎక్కువగా హైలైట్ అయ్యింది. జాన్వీ – సారాల డేటింగ్ వ్యవహారానికి సంబంధించి కరణ్ జోహార్ ప్రశ్నలు అడిగిన విషయం తెలిసినదే కదా. అదిగో అప్పుడే మొదలయ్యింది అసలు విషయం.

విషయం నిజమేనా?

లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని, ఈ ఎపిసోడ్లో ఓ రాపిడ్ ఫైర్ రౌండ్ జరిగింది. దాంట్లో రష్మిక మందన్న కు పెరుగుతున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల గురించి చర్చ జరుగగా.. సారా అలీ ఖాన్ వెంటనే విజయ్ పేరుని ప్రస్తావించింది. కాగా ఇది విజయ్ – రష్మిక మధ్య డేటింగ్ వ్యవహారాన్ని సూచింస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు ఈ విషయంపైనా విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక.. డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసినదే.