టీడీపీలో శివ రీఎంట్రీ? సీటు ఫిక్స్?

గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఓటమి వల్ల కావొచ్చు..జగన్ అధికారంలోకి రావడం వల్ల కావొచ్చు కొందరు నేతలు రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు…పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై బాగా దెబ్బపడింది…అలాగే వరుసపెట్టి చాలామంది నేతలు కేసులు ఎదురుకున్నారు…జైలుకు వెళ్లారు. ఇలా టీడీపీ నేతలు ఇబ్బందులు పెరిగాయి…ఈ క్రమంలో పలువురు నేతలు సైలెంట్ అయ్యారు. కానీ గత ఏడాది కాలం నుంచి టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు రావడం మొదలుపెట్టారు.

నిదానంగా టీడీపీ పుంజుకోవడం, వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు యాక్టివ్ అయ్యారు. ఇప్పటికీ చాలామంది నేతలు యాక్టివ్ అయ్యారు. ఇదే క్రమంలో టీడీపీలో మచ్చలేని నాయకుడుగా గుర్తింపు పొందిన వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ సైతం టీడీపీలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వరద బాధితులని పరామర్శించడానికి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారు. ఈ పర్యటనలో శివ కూడా పాల్గొన్నారు.

అయితే గతంలో శివ…ఉండి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. కానీ గత ఎన్నికల్లో చంద్రబాబు…శివని నరసాపురం ఎంపీగా నిలబెట్టారు. జగన్ గాలిలో స్వల్ప మెజారిటీ తేడాతో శివ ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో శివ మళ్ళీ…ఉండి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అక్కడ ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు సోదరుడు వరుసయ్యే మంతెన రామరాజు ఉన్నారు. శివ నరసాపురం వెళ్ళడంతో…ఉండి సీటు రామరాజుకు దక్కింది…అలాగే ఉండి టీడీపీ కంచుకోట కావడంతో రామరాజు గెలిచారు.

ఈ సారి మాత్రం నరసాపురంలో రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారు…కాకపోతే ఆయన ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు..పొత్తులని బట్టి ముందుకెళ్తారు. దీంతో శివ…మళ్ళీ ఉండికి వచ్చేస్తున్నారని సమాచారం. శివ అయితే…ఉండిలో ఈజీగా గెలుస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే టీడీపీలో శివ మళ్ళీ యాక్టివ్ అయ్యారు.