భూమా వార‌సుల విష‌యంలో జ‌గ‌న్ సైలెన్స్ వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా…!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎవ‌రు ఎటైనా మారిపోవ‌చ్చు. ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. క‌ర్నూలు జిల్లాలోభూమ నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు త‌మ‌ను ముంచేశార‌ని.. త‌మ భూముల‌పై అప్పులు చేశార‌ని.. త‌మ‌కు తెలియ‌కుండా.. అప్పులు తీసుకోవ‌డం ఏంట‌ని.. ఓవ‌ర్గం ప్ర‌జ‌లు ల‌బోదిబో మంటున్నారు. దీనిపై అధికార పార్టీ నేత‌ల‌ను కూడా క‌లిసి మొర‌పెట్టుకున్నారు. అయితే.. వీరి ఆవేద‌న‌ను.. ఆందోళ‌న‌ను అధికార పార్టీ నేత‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఆళ్లగడ్డ: జగన్ పార్టీ అభ్యర్థిగా అఖిలప్రియ (ఫొటో) | Akhila Priya to contest  for Allagadda Bypolls: Jagan - Telugu Oneindia

పోనీ.. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, మౌనిక‌, జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డిల విష‌యంలో ఏమై నా క‌ఠినంగా ఉందా.. అంటే.. అది కూడా లేదు. అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై చాలా ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. టీడీపీని నైతికంగా దెబ్బ‌కొట్టాల‌నే వ్యూహం ఉంద‌ని.. తెలుస్తోంది. ప్ర‌స్తుతం భూమా అఖిల కుంటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అటు హైద‌రాబాద్‌లో భూముల క‌బ్జా కేసు ఉంది.

మ‌రోవైపు.. నంద్యాల‌లో కొంద‌రు భూముల ప‌ట్టాల‌ను బ్యాంకులో తాక‌ట్టు పెట్టి డ‌బ్బులు తెచ్చుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై సుమారు 50 మందికి పైగా ఆయా భూములు తాక‌ట్టు పెట్టిన వారు.. ల‌బోదిబో మంటున్నారు.(అంటే.. ఆయా భూముల ప‌త్రాల‌ను నాగిరెడ్డి హ‌యాంలో వీరికి ఇచ్చి.. కొంత మొత్తం సొమ్ము తీసుకున్నారు. అయితే.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఇవే ప‌త్రాల‌ను బ్యాంకులోపెట్టి .. ఆయ‌న వార‌సులు అప్పులు చేశార‌ట‌) దీంతో ఇది వివాదంగా మారింది.

Telugu Desam leader urges police to arrest former minister Bhuma Akhila  Priya in a murder conspiracy case | Vijayawada News - Times of India

అయితే.. వైసీపీ, జ‌గ‌న్ టీం మాత్రం.. మౌనంగా ఉంది. ప్ర‌జ‌లు వ‌చ్చి స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేస్తున్నా.. వారు ప‌ట్టిం చుకోవ‌డం లేదు. ఇది సివిల్ కేసు.. కోర్టుకు వెళ్లాల‌ని సూచిస్తున్నార‌ట‌. అయితే.. దీనివెనుక‌.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి.. భూమా కుటుంబాన్ని.. రోడ్డున ప‌డేసేలా… టీడీపీ ఒక‌వేళ టికెట్ ఇచ్చినా.. వారిపై యాంటీ ప్ర‌చారం చేయించేలా .. పెద్ద ఎత్తున వ్యూహం న‌డుస్తున్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందోచూడాలి.