ఆ స్టార్ హీరో వల్లే గోపీచంద్ సినిమా సక్సెస్ అయ్యిందా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే కొన్ని కథలు, కొన్ని పాత్రలు కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని పాత్రలు కొంతమంది నటీనటులు సైతం మిస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో నటించే అవకాశం ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన ఆ కథ తనకు సూట్ అవ్వదని చెప్పి సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగిందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. అలా మరొక కథను కూడా రిజెక్ట్ చేశారు ఎన్టీఆర్. ఆ సినిమానే రణం.Jr NTR - Gopichand: అప్పుడు ఎన్టీఆర్ చేసిన కథే ఇప్పుడు గోపీచంద్  చేస్తున్నాడా..? | Gopichand Pakka Commercial movie story line will be like  Jr NTR Temper movie pk– News18 Telugu

ఈ సినిమాని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. తాజాగా అమ్మ రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. రణం సినిమా కథను ఎన్టీఆర్ కు ముందు తెలపగా అయితే ఆ కథ ఎన్టీఆర్ కు సూటు కాదని నాకు తెలుసు అని.. అదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా చెప్పుకొచ్చారని తెలిపారు. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హీరో విలన్ ముందు కూర్చుని ఉండాలి అయితే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఆ స్థాయిని తగ్గించి చూపించడం సరికాదని తాను భావించి ఆ కామెంట్ చేశానని తెలిపారు.Prime Video: Ranam

అయితే రణం సినిమా కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ గోపీచంద్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట ఆ సమయంలో సంతోష్ శ్రీనివాస్ ద్వారా మొదట తను గోపీచంద్రుని కలిశానని తెలియజేశారు అమ్మ రాజశేఖర్. ఒక గోపీచంద్ రణం సినిమా కథ విన్న వెంటనే ఓకే చెప్పారని .. అలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుందని అమ్మ రాశేఖర్ తెలిపారు. అయితే ఆ తర్వాత పలు సినిమాలకు అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ చేసిన కూడా ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రస్తుతం సినిమా ఆఫర్లు భారీగానే తగ్గిపోయాయి ఈ డైరెక్టర్ కు అంతేకాకుండా బిగ్ బాస్ షో లో అమ్మ రాజశేఖర్ పాల్గొన్న ఆ షో తో పెద్దగా గుర్తింపు రాలేకపోయింది.