ఇండియన్-2 రీ స్టార్ట్.. రాంచరణ్ సినిమాతో సంబంధం లేకుండా షూటింగ్..!?

కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి, లంచం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్న భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని పాటలు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఆసక్తికకరగా చూస్తూనే ఉంటారు సినిమా ప్రేక్షకులు..

అయితే భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు-2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. భారతీయుడు-2 సినిమా ఇప్పటికే ప్రారంభమవ్వగా.. కరోనా, లాక్ డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

తాజాగా ఈ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల విక్రమ్ సినిమా షూటింగ్ లో కమల్ హాసన్ తెలిపాడు. లైకా ప్రొడక్షన్స్ వారితో దీనిపై కమల్ సంప్రదింపులు జరిపారు. అయితే ప్రస్తుతం రాంచరణ్ తో శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు వార్తలొచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తోంది.

కానీ దానితో సంబంధం లేకుండా రాంచరణ్, కమల్ హాసన్ సినిమాలు రెండూ సమాంతరంగా షూటింగ్ చేసేందుకు శంకర్ సిద్దమయినట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు అటూ, ఇటూగా ఒకేసారి విడుదలకు సిద్దం కానున్నాయని సమాచారం.