వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన ధనుష్ “సార్”..ఆకట్టుకుంటున్న టీజర్..!!

కోలీవుడ్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న ధనుష్..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాచురల్ యాటింగ్ తో క్లాస్ మాస్ ఆడియన్స్ ని తనదైన స్టైల్ లో అలరిస్తుంటాడు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్ లోను మంచి మార్కెట్ ఉంది. ధనుష్ కి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రజనీ కాంత్ అల్లుడి గా పేరు సంపాదించుకున్న ఈ హీరో..ఇప్పుడు సొంత పేరు పై నిలబడ్డాడు. సినిమాల పరంగా ధనుష్ సూపర్ అందులో నో డౌట్.. కానీ , ఈ మధ్యనే భార్యకు విడాకులిచ్చి నెట్టింట ట్రోలింగ్ కి గురౌతున్నాడు.

మరి ఇలాంటి టైంలో ఆయన నుండి సినిమా అంటే నిర్మాతలు కొంచెం భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. కానీ, కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఆయన సార్ సినిమా టీజర్ చూస్తే..ఆ రూమర్స్ అన్ని పటాపంచలైపోయాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమానే ఈ సార్ (SIR). ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నారు వెంకీ అట్లూరి . సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చిన రోజు నుండి అందరి లోను ఒక్కటే డౌట్ అస్సలి ఈ సినిమా కి ఆ టైటిల్ ఏంటి..ధనుష్ లుక్స్ కి ఇలాంటి టైటిల్ నా అంటూ తిట్టుకున్నారు. కానీ టీజర్ చూస్తే ఈ సినిమా కి సార్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధమైపోతుంది.

నిన్న అనగా జూలై 27న ధనుష్ బర్త్ డే ..ఈ సందర్భంగా సార్ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. దానితో ఫ్యాన్స్ సంతృప్తి పడలేదు ..అందుకే వాళ్లకి బర్తడే గిఫ్ట్ గా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే ..సినిమా మొత్తం చదువుకు సంబంధించిన ఎలిమెంట్స్ తో నే ముందుకు వెళ్లింది. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్ అంటూ మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్’ అంటూ సాగే డైలాగ్‌తో టీజర్‌ను స్టార్ట్ చేసి..మేకర్స్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకునేలా చేసారు. ఒక్కటి మాత్రం కన్ ఫామ్.. చదువు ని అడ్డుపెట్టుకుని డబ్బు పిండే ప్రతి వాడికి ఈ సినిమా పగిలిపోయే ఆన్సర్ ఇస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుత సమాజంలో విద్య ని ఎలా కొనుకుంటున్నాము..అనేది చాలా క్లీయర్ గా చూయించాడు డైరెక్టర్. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. నో డౌట్ ఈ సినిమా తో ధనుష్ ఓ కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది.

 

Share post:

Latest