రూట్ మార్చిన జగన్..టార్గెట్ కోసమేనా?

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే…తమ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు ప్రజలందరి మద్ధతు మనకెందుకు ఉండకూడదు…ఎమ్మెల్యేల అంతా కలిసికట్టుగా పనిచేసి…గడప గడపకు వెళ్ళి…మనం చేసిన మంచి పనులు వివరించి…ఇంకా ఎక్కువగా ప్రజా మద్ధతు సాధిస్తే 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమో చెప్పాలని జగన్…ఎమ్మెల్యేలని అడిగిన విషయం తెలిసిందే. అలాగే ఇక నుంచి ఎమ్మెల్యేలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని…ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లాలని, ఆరు నెలల్లో ప్రజల మద్ధతు పెంచుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే జగన్ క్లాస్ తీసుకున్న కూడా ఎమ్మెల్యేల పెద్దగా కదలిక ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో కొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతున్నారు గాని…మరికొందరు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదు. పైగా కొందరికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవుతున్నాయి…దీంతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.  ఇక ఎమ్మెల్యేలనే నమ్ముకుంటే కష్టమని జగన్ అవగాహనకు వచ్చేసినట్లు కనిపిస్తోంది.

అందుకే తానే డైరక్ట్ రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పథకాల ప్రారంభ కార్యక్రమాలని ప్రజల్లోనే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున సభలు పెట్టి బటన్ నోక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు ప్రజల్లో ఉండాలని తాజాగా సూచించారు.

అలాగే ఇంకా కార్యకర్తలతో తానే డైరక్ట్ గా మాట్లాడి…నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్తితులని తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీ నుంచి కార్యకర్తలతో సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన  50 మంది కార్యకర్తలతో జగన్‌ సమవేశమవుతారు…వారి ద్వారా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ పరిస్తితి గురించి తెలుసుకోనున్నారు. దీని ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడం సాధ్యమవుతుందని జగన్ భావిస్తున్నారు. అలాగే అన్నీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తే 175కి 175 సీట్లు గెలుచుకునే టార్గెట్ రీచ్ అవుతామని జగన్ అనుకుంటున్నారు.