నెలకో స్టార్ ని చూపించి అభిమానులను కంగారు పెడుతున్న బాలీవుడ్ ?

కొన్ని మీడియా సంస్థలు బాగా తయారయ్యాయి. కేవలం సినిమా హీరోల అభిమానులను టార్గెట్ చేస్తూ కొన్ని గేమ్స్ ప్లే చేస్తున్నాయి. ఇక మనవాళ్ళకి ఎలాగూ బుద్ధి ఉండదు. ఎమోషన్స్ తప్ప లాజిక్స్ వుండవు. ఇంటిలో వాళ్ళ అమ్మ పాల పేకెట్ తెమ్మన్నా పట్టించుకోరు గాని, అభిమాని హీరోలకు మాత్రం పాలాభిషేకాలు చేస్తారు. అలా వున్నారు మన మూర్ఖులు. అలాంటివారి బలహీనతను గ్రహించిన కొన్ని మీడియాలు వారిని బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. సదరు హీరోల మధ్య బాండింగ్ బాగానే ఉంటుంది. వీళ్లూ వీళ్లూ మాత్రం కొట్టుకొని చేస్తుంటారు.

ఆ మీడియా సంస్థ ఇదే:

బాలీవుడ్ మీడియా సంస్థ అయినటువంటి ORMAX MEDIA ప్రతీ నెల అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను విడుదల చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా జూన్ నెలకు గాను మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫీమేల్ తెలుగు స్టార్స్ లిస్టును ప్రకటించింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ లో ఉన్నట్టు చెప్పారు. అయితే ఈ లిస్ట్ ఏ నెలకు ఆ నెల మారిపోతుంది. వీరు దేన్ని ప్రాతిపదికగా చేసుకొని ఇలా ప్రకటిస్తారో మనకి అర్ధం కాదు.. లోగుట్టు పరమేశుడికెరుక.

అభిమానుల క్యూరియాసిటియే వారికి ఆదాయం?

అవును.. అభిమానుల క్యూరియాసిటియే వారికి ఆదాయం తెచ్చిపెడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి అభిమాని సదరు వెబ్సైటుని సందర్శిస్తారు. ఇలా దాదాపు అందరు హీరోల అభిమానులు కూడా సదరు మీడియాలో ఏం వస్తుందనే విషయాలు చదువుతారు. ఈ క్రమంలో అవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఏది ప్రామాణికంగా తీసుకొని ఈ లిస్ట్ వారు రెడీ చేస్తున్నారో అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెలకో స్టార్ ని అగ్ర స్థానంలో ఉంచి వారి ఫాలోయింగ్ బాగానే పెంచుకుంటున్నారని.. ప్రతీ నెల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ చేసుకోడానికి కారణమవుతున్నారని అభిప్రాయ పడుతున్నారు.

Share post:

Latest