జాన్వీ కపూర్ ఇంటిని కొన్న నటుడు.. మరీ అన్ని కోట్లా?

జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. ఈ జనరేషన్ పిల్లలకు అస్సలు అవసరం లేదు. ఎవరిని అడిగినా ముందు శ్రీదేవి పేరు చెబుతారు. అవును… స్వర్గస్తురాలైన నటి శ్రీదేవి – బోణి కపూర్ల గారాల కూతురే జాన్వీ కపూర్. ఇక ఆమె అంతస్థు గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాయలకు వారసురాలు ఆమె. ఆమె ఇల్లంటే మామ్మూలుగా వుంటుందా? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన జాన్వీ ఇల్లు కూడా బంగారు మయం. అలాంటి ఇంటిని ఓ సాధారణ నటుడు కొనుగోలు చేసాడంటే మీరు నమ్ముతారా?

అవును. మీరు విన్నది అక్షరాలా నిజం. అతగాడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో నిలదొక్కుకున్నాడు. హీరోగా అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ఇంతింతై వటుడింతై తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రామిస్సింగ్ స్టార్ హీరోల్లో ఒకడిగా సత్తా చాటుతున్నాడు. అందరు నటుల్లానే ఆరంభ రోజుల్లో జీవనం కోసం ఇబ్బందులను పడిన పరిస్థితి. అయితే ఒక్కొక్క దాన్ని అధిగమించి బాగా నిలదొక్కుకున్నాడు. ఎంతలా అంటే అతడు ఇప్పుడు ఏకంగా అమితాబ్ బచ్చన్.. జాన్వీ కపూర్ లాంటి స్టార్లు నివాసం ఉండే పరిసరాల్లో 44 కోట్లతో క్వాడ్రప్లెక్స్ ఇల్లు కొన్నాడు.

ఇంతకీ ఎవరా హీరో? అనేదేగా మీ డౌట్. అతని పేరు రాజ్ కుమార్ రావు. అవును… సెలబ్రిటీలంతా నివాసం ఉండే పోష్ ఏరియా జుహులో ట్రిపుల్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు కోసం రూ. రూ. 44 కోట్లు, రిజిస్ట్రేషన్ కి 2.19 కోట్లు చెల్లించారు. మొత్తంగా రాజ్ కుమార్ రావు రూ.46 కోట్ల వరకూ వెచ్చించడం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందే రణ్ వీర్ సింగ్ బాంద్రాలో సీ-వ్యూ క్వాడ్రప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడానికి 119 కోట్లు వెచ్చించాడని విన్నాం. ఇంతలోనే రాజ్ కుమార్ రావు.. పత్రలేఖ జంట జుహూలో కొత్త ఆస్తిని సంపాదించడానికి రూ.44 కోట్లు వెచ్చించడం విశేషం.

3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని 2020 డిసెంబర్ లో జాన్వీ కపూర్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఆస్తిని రాజ్ కుమార్ రావుకు విక్రయించినట్లు సమాచారం. ఈ అపార్ట్ మెంట్ 14వ 15వ 16వ అంతస్తులలో అటాచ్డ్ గా ఉంటుంది. దాంతో పాటు 6 పార్కింగ్ స్లాట్ లకు ప్రత్యేకమైన యాక్సెస్ కోసం రూ.2.19 కోట్లను రిజిస్ట్రేషన్ గా వెచ్చించారని తెలుస్తోంది. ప్రీమియం ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ అమ్మకం కొనుగోలు గురించి ఇరువైపుల నుండి ఎటువంటి ధృవీకరణ లేనప్పటికీ జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.