రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం బండ్ల గణేష్ పారితోషకం అన్ని లక్షలా..!

ముఖ్యంగా నట కిరీట రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం బండ్ల గణేష్ ఆయన సినిమాలలో ఎక్కువగా నటించారు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. కానీ ఇటీవల ఆయన నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ తీసే సినిమాలకు బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాలలో కూడా అరంగేట్రం చేసి.. ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో రాజకీయాలు ఈయనకు కలిసి రాలేదని చెప్పాలి.Whammo.. Is Bandla Ganesh's remuneration all lakhs of rupees per day?ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పలు సందర్భాలలో వివాదాస్పద ట్వీట్లు చేస్తూ భారీ స్థాయిలో వివాదాలకు తెర లేపుతూ ఉంటారు. ఇక తనకు అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చి వార్తల్లో నిలిచిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇకపోతే త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్ర లో నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే వేణు పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం దర్శకుడు శరత్ మండవ బండ్ల గణేష్ ను సంప్రదించారట. ఒక్కరోజు డబ్బింగ్ చెప్పాలి అని అడగగా బండ్ల గణేష్ డబ్బింగ్ చెప్పాలి అంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరాడట.

బండ్ల గణేష్ చెప్పిన మాటలకు ఖంగుతిన్న దర్శకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఈ విషయం తెలిసి వేణు తొట్టెంపూడి కి బండ్ల గణేష్ వాయిస్ సూట్ అవ్వదు..కానీ దర్శకుడు ఎందుకు ఆ విధంగా ఆలోచించాడని నెటిజెన్లు కూడా కామెంట్లు బాగా చేస్తున్నారు. కానీ గత్యంతరం లేక వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ కుదరక చచ్చినట్టు బండ్ల గణేష్ కు రూ. 5, 00,000 ఇచ్చినట్లు సమాచారం.