జబర్దస్త్ గుడ్ బై చెప్పిన అనసూయ.. వీడియో వైరల్..!!

జబర్దస్త్ కామెడీ షో అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కామెడీ షో అని చెప్పవచ్చు. ఇక ఇందులో కమెడియన్లు సైతం ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను అందుకున్నారు. అలా ఇందులో యాంకర్ గా చేస్తున్న అనసూయ తాజాగా జబర్దస్త్ షో ని విడిచి వెళ్లేటువంటి ఒక ప్రోమో వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.darja movie దర్జా రిపోర్ట్జబర్దస్త్ షో నుంచి గత కొంతకాలంగా పలువురు కమెడియన్లు సైతం ఈ షోని విడిచి వెళ్లిపోవడంతో త్వరలో ఈ షో మూసి వేయబోతున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా ప్రోమోతో అలాంటి వాటిని చెక్ పెడుతూ ఒక ప్రోమోని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ప్రోమో విషయానికి వస్తే చలాకి చంటి మాట్లాడుతూ అనసూయకు ఇదే లాస్ట్ షో అంటూ మొదట ఈ స్కిట్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత తాగుబోతు రమేష్ అనసూయ మీద ఏకంగా స్కిట్ చేయడం ఈ ప్రోమోలో చూడవచ్చు.

ఇక ఈ ప్రోమో లోనే డైలాగులతో జడ్జి అయిన ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. మీకు చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ చేశారు కానీ మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు.. అని చంటి అడగడం జరిగింది. కానీ అనసూయ మాత్రం ఏ దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నది. ఇక చివరిలో ఇంద్రజ ఎమోషనల్ అవడం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ అనసూయని పట్టుకొని కన్నీరు పెట్టుకుంది. అయితే వాస్తవానికి అనసూయ జబర్దస్త్ విడిచి వెళుతున్నట్లు గత కొన్ని రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రోమోతో జబర్దస్త్ టీమ్ కూడా అనసూయ వార్తని కన్ఫర్మ్ చేశారు దీంతో అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోందని తెలుస్తోంది.