ఆ విషయంలో క్లారిటీ ఇస్తున్న అనసూయ.. వివాదాలు వద్దంటూ క్లాస్?

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఓవైపు బుల్లితెరపైన వివిధ షోలు చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది అనసూయ. అయితే సినిమాల్లోకి రాకముందే బుల్లితెరపైన తనదైన మార్క్ ని వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ ఆ విధమైన భారం తన ముఖంలో ఎప్పుడు కనిపించదు. అందుకే ఈ తరమువారు కూడా ఆమెని ఎంతగానో ఇష్టపడతారు. హీరోలకు మాదిరి ఆమెకి కూడా ఒరకమైన ఫాలోయింగ్ ఉందంటే ఆమె స్టార్ డం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

వివాదం ఏమిటంటే?

అనసూయ నటించిన దాదాపు అన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏదో ఒక స్థాయిలో పాల్గొంటుంది. అయితే ఆమె నటించిన ‘దర్జా’ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో మాత్రం ఆమె జాడ కనిపించడం లేదు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల గురించి వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈ వారం దర్జా ను విడుదల చేయబోతున్నారు. దాంతో సినిమా సభ్యులు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కానీ అనసూయ మాత్రం ఎక్కడ కనిపించడంలేదు. ఈ విషయంలో ఓ వివాదం చెలరేగింది.

అనసూయ క్లాస్ దేనికంటే?

ఈ విషయంలో వివాదం ఏమీ లేదని తాజాగా అనసూయ స్పష్టతనిచ్చింది. వేరే ప్రాజెక్ట్ ల యొక్క షూటింగ్స్ తో బిజీగా ఉండటం వలెనే సమయాన్ని కేటాయించలేకపోతున్నాని చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్క సారిగా పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే దర్జా సినిమా కు సమయం కేటాయించడం కుదరడం లేదని ఆమె వివరణ ఓ మీడియా వేదికగా ఇచ్చింది. దర్జా సినిమా నిర్మాతలకు కూడా ఆ విషయం తెలుసని.. వారు అర్థం చేసుకున్నారు అన్నట్లుగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. పో

Share post:

Latest