ఆ సినిమా కోసం సమంత రికార్డ్ రెమ్యూనరేషన్..కెరీర్ లోనే హైయెస్ట్ ఇదే?

టాలీవుడ్ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన హాట్ బ్యూటీ సమంత అంటే..ఇండస్ట్రీలో ఓ మంచి పేరుంది. ఏ మాయ చేసావే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు .. మొదటి సినిమాతో నే టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది. ఫస్ట్ సినిమాలోనే అమ్మడు లిప్ కిస్ లు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ ముద్దుల ఎఫెక్ట్ తోనే..కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని..ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్ గా రాజ్యమేలుతుంది.

కాగా, ఇటీవలే విడాకులు తీసుకున్న సమంత..అప్పటి నుండి లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఎక్స్ పోజింగ్ చేస్తుంది. ఎంతలా అంటే..మొన్న ఆ మధ్య ఓ సారి ఏకంగా టూ పీస్ బికినీ తో రచ్చ రచ్చ చేసింది. అంతేనా..బికినీ లో యోగా చేస్తూ..సంచలనానికి తెర తీసింది. అప్పటి నుండి అమ్మడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. కాగా, సమంత ఎన్నాళ్ళ నుండో వేచి చూస్తున్న బిగ్ ఆఫర్ ఆమెకు దక్కిన్నట్లు తెలుస్తుంది. సౌత్ హీరోయిన్స్ అందరు నార్త్ లో సినిమాలు చేయాలని..అక్కడ మార్కెట్ సంపాదించుకోవాలని చూస్తుంటారు.

అలాగే సమంత కూడా నార్త్ లో ఆఫర్ల కోసం తెగ ట్రై చేసింది. కానీ, ఊహించిన స్దాయి ఆఫర్ రాలేదు. అయితే, రీసెంట్ గా ఆ కోరికను తీర్చుకున్నట్లు తెలుస్తుంది. ‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ సమంత.. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ తో అక్కడ పాగ వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయని..త్వరలో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సినిమా కోసం అమ్మడు..కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా కోసం అమ్మడు 7 కోట్లు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా బాలీవుడ్ లో ఆమెను ఏ స్దాయికి తీసుకెళ్తుందో..?