చిట్టి బెల్లీ డ్యాన్స్..కుర్రాళ్లు కు కొత్త ఊపు తెప్పిస్తున్న ఫరియా అబ్దుల్లా..!!

యస్.. తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ వీడియో చూసిన జనాలు ఇదే అంటున్నారు. ఏం ఊపుతుందిరా సామీ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమాటకు ఆ మాటే..చిట్టి బెల్లీ డ్యాన్స్ అదరకొట్టేసింది. నిన్న మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన ఈ జాతిరత్నాలు బ్యూటీ..ఒక్కసారిగా రూట్ మార్చి నాభీ అందాలను చూయిస్తూ హాట్ పర్ ఫామెన్స్ లు ఇవ్వడంతో కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.

నిజానికి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేసింది ఒక్కటే సినిమా. అది కూడా జాతి రత్నాలు అనే కామెడీ సినిమా. ఆ సినిమాలో చిట్టి పాత్రలో ఈ ఫరియా అబ్దుల్లా ఇరగదీసింది. ఎంతలా అంటే..ఇప్పటికి ఆమెను ఎక్కడికి వెళ్లినా చిట్టి పేరుతోనే పిలుస్తున్నారు. అంతలా ఆమె ఆ పాత్ర లో లీనమై నటించి ..మెప్పించి..కామెడీతో అలరించింది. ఆ తరువాత గెస్ట్ గా రెండు సినిమాలు..ఓ ఐటెం సాంగ్ చేసినా..అవి ఏవి చిట్టిని ఇండస్ట్రీ వద్ద నిల్చో పెట్టలేకపోయాయి.

ప్రజెంట్ చిట్టి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటీ సెకండ్ హీరోయిన్ గా అయితే..రెండోది హీరో కి సిస్టర్ రోల్ లో ఉండే సినిమా. ఈ సినిమాలు హిట్ అయినా చిట్టి క్రెడిట్ లోకి రావు. అంత చిన్న రోల్స్ అవి. అయితే, తాజాగా హైదరబాద్ లో చిట్టి ఓ స్టేజీ పర్ ఫామెన్స్ ఇచ్చింది. ఆ బెల్లీ డ్యాన్స్ చూసిన జనాలు ఆశ్చర్యపోయేలా ఉంది చిట్టి అందాల ప్రదర్శన. నాభి అందాల‌ను చూపిస్తూ అమ్మ‌డు చేసిన డాన్స్ చూసి నెటిజ‌న్స్‌కు మ‌తి పోయింది. “టూ హాట్ చిట్టి” అని కొంద‌రు కామెంట్స్ పెడుతుంటే.. మ‌రి కొంద‌రేమో “నీలో ఈ యాంగిల్ కూదా ఉందా” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి చిట్టి వీడియో వైరల్ గా మారింది.