మూడో భార్యకు చుక్కలు చూపిస్తున్న నరేష్… నిజాలు బయటపెడతా అంటూ వార్నింగ్?

సీనియర్ తెలుగు నటుడు నరేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తొలుత ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి అప్పటి లేడి సినిమా ఫాన్స్ కి కలల రాకుమారుడయ్యాడు. ప్రస్తుతం కొన్ని రకాల ముఖ్యమైన పాత్రలలో అలరిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా కొన్ని రకాల రూమర్స్ హీరో నరేష్ పైన సోషల్ మీడియాలలో వస్తున్నాయి. ప్రాముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి పవిత్ర లోకేష్ తో కలిసి తరచు బయట కనిపిస్తున్న నరేష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా వీరిద్దరూ కలిసి మహాబలిపురంలో ఒక దేవాలయాన్ని సందర్శించడం వీటికి ఆజ్యం పోసింది. ఇదిలా ఉండగా, అతని మూడవ భార్య అయినటువంటి రమ్య గతంలో నరేష్ పైన పలు ఆరోపణలు చేసిన సంగతి విదితమే. తాజాగా ఆమె ఒక కన్నడ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేమిద్దరం ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాము. మా బంధానికి కృష్ణ గారి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఉంది. అని చెప్పింది. దాంతో మీడియా నరేష్ పైన కోడై కూస్తోంది.

వెండి తెరపైన రాముడు మంచి బాలుడు వలె కనిపించిన నరేష్ నిజజీవితంలో కాదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ విషయం గురించి నరేశ్ ని ఓ మీడియా వేదికగా ప్రశ్నిస్తే, రమ్య చేస్తున్న ఆరోపణలపై స్పందించకుండా అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయాడు. ఇలా నరేష్ కారులో వెళ్తుండగా మీడియా ప్రతినిధులు నరేశ్ తో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “మీతో నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. కానీ నాకు ఇప్పుడు వేరే పని ఉంది.

అందువల్ల ఇక్కడినుండి వెళ్లిపోవాల్సి వస్తోంది. త్వరలోనే నేను రమ్య గురించి నిజాలన్ని బయట పెడతాను. నాకు న్యాయం కావాలి. న్యాయం జరిగే వరకు పోరాడుతాను! అంటూ చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ మలుపు తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Share post:

Popular