గుడివాడ‌లో 15 ఏళ్ల మైన‌ర్ బాలుడుతో లేచిపోయిన 28 ఏళ్ల వివాహిత‌.. క‌ట్ చేస్తే…!

స‌మాజంలో ఎవ‌రికి వారు వావి వ‌ర‌సలు, వ‌య‌స్సు మ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం అంతా స‌మాజంలో ఇల్లీగ‌ల్ వ్య‌వ‌హారాలు ఎక్కువ అవుతున్నాయి. అక్ర‌మ సంబంధాలు, ఆక‌ర్ష‌ణ‌ల మోజులో ప‌డి ఎవ‌రికి వారు జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ‌లో జ‌రిగిన ఓ విష‌యం ఇప్పుడు అంద‌రూ ముక్కున వేలేసుకునేలా ఉంది. గుడివాడ‌లో గుడ్‌మెన్‌పేట పేరుతో ఓ కాల‌నీ ఉంది. ఆ కాల‌నీలో 15 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మైన‌ర్ బాలుడు క‌నిపించ‌కుండా పోయాడు.

దీంతో బాలుడి త‌ల్లిదండ్రులు త‌మ కుమారుడు ఎక్క‌డ ఉన్నాడో ? అని ఒక్క‌టే వెత‌క‌డం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇళ్ల‌లో వెతికినా క‌న‌ప‌డ‌లేదు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అదే టైంలో బాలుడి ఎదురింట్లో ఉండే ఓ వివాహిత ( 28) కూడా మిస్ అవ్వ‌డంతో బాలుడి త‌ల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళ‌న చెల‌రేగింది. ఆ వివాహితే త‌మ కుమారుడిని అప‌హ‌రించింది అంటూ వారు పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

 

 

భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఎదురింట్లోనే ఉండే వివాహిత బాలుడితో వెళ్లిపోవ‌డం ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వివాహిత మాయ‌మాట‌ల‌తోనే బాలుడిని తీసుకు వెళ్లిన‌ట్టు త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో గుర్తించామ‌ని పోలీసులు చెపుతున్నారు. అయితే డ‌బ్బుల కోస‌మే బాలుడిని వివాహిత కిడ్నాప్ చేసిందా ? లేదా ? ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం న‌డుస్తుందా ? అన్న‌ది తెలియ‌రాలేదు.

వివాహిత స్వ‌ప్న ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు వీళ్లిద్ద‌రి కోసం వేట స్టార్ట్ చేశారు. ఒక వేళ డ‌బ్బుల కోసం వివాహిత కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికే కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ కాల్స్ వ‌చ్చేవి. లేక‌పోవ‌డంతో ప‌లు అనుమానాల‌తో పాటు ఇద్ద‌రి మ‌ధ్య సంబంధంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. గ‌తంలో కూడా చాలా మంది వివాహిత‌లు త‌మ కంటే చిన్న‌వాళ్లు అయిన మైన‌ర్ బాలుర‌ను తీసుకుపోయిన సంద‌ర్భాలు చూశాం.

Share post:

Latest