జ‌గ‌న్ ఆ ప‌నిచేస్తే.. త‌ప్పేంటి…!

ఏపీ సీఎం జ‌గ‌న్ .. ఇప్ప‌టి వ‌రకు దేశంలో ఏముఖ్య‌మంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత ప‌ద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. సోష‌ల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ఆయ‌న అమ‌లు చేశారు. 2019లో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో ఆయ‌న తీసుకు న్న ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన వారు.. అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. కొంద‌రు ఏకంగా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము కూడా అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఒక ర‌కంగా .. చెప్పాలంటే.. పొరుగు రాష్ట్రాల్లోని మంత్రి వ‌ర్గంలో మ‌హిళ‌లకు ప్రాధాన్యం క‌ల్పించ‌ని ప‌రిస్థి తి నుంచి క‌ల్పించే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. అది జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంగానే భావిస్తున్నారు. ఇది జ నంలోకి బాగానే వెళ్లింది. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌కు ల‌భించ‌ని ప్రాధాన్యం ఇప్పుడు ల‌భించింద‌ని… ఆయా వ‌ర్గాలు హ్యాపీగా ఫీలయ్యాయి. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా మేలు చేస్తుంద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది.

అయితే.. ఇటీవల కొన్ని రోజులుగా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ బాగుంద‌ని అంద‌రూ అంటుంటే.. వీరు మాత్రం నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యాన్ని తెర‌మీ దికి తెస్తున్నారు. స‌ల‌హాదారులు, కార్పొరేష‌న్ల చైర్మ‌న్ ప‌ద‌వుల విష‌యాన్ని ప్ర‌స్తావించి.. సీఎం జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేసేందుకు… ప్ర‌త్యేకంగా.. ఒక గ్రూపు ఏర్ప‌డిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా.. ఇప్పుడు వైసీపీ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

నిజానికి ఏ పార్టీకైనా.. ప్ర‌భుత్వానికైనా.. సామాజిక వ‌ర్గాల కూర్పు అత్యంత కీల‌కం. రేపు రాష్ట్రంలో వైసీపీ కాకుండా.. ఏ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా.. `ఇంత‌కు మించి` అనే రేంజ్‌లో చేస్తాయ‌ని, చేస్తార‌ని ఊహిం చేందుకు అవ‌కాశం లేదు. అయితే.. ఏదో ఓ ర‌కంగా.. వైసీపీపై బుర‌ద జ‌ల్లాల‌నే కార‌ణంగానే.. ఇలా యాగీ చేస్తున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన యు వ నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని.. కాబ‌ట్టి.. త‌మ‌కు కూడా ప్రాధాన్యం ఉంటుంద‌ని.. అనుకుంటు న్నారు.

ఇది స‌హ‌జం కూడా! అంత‌మాత్రాన‌.. కీల‌క‌మైన‌.. ప‌దవులు మొత్తంగా.. సీఎం జ‌గ‌న్ వారి చేతుల్లో ఎక్క‌డా పెట్ట‌లేదు. కొన్ని స‌ల‌హాదారు ప‌ద‌వులు.. కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ ప‌ద‌వులు మాత్ర‌మే అప్ప‌గించా రు. మొత్తానికి జ‌గ‌న్ విష‌యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. సామాజిక ప‌రంగా.. జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాన్ని మాత్రం అంద‌రూ హ‌ర్షిస్తున్నార‌నేది వాస్త‌వం అంటున్నారు నెటిజ‌న్లు.

Share post:

Popular