భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే అదృష్టమే అదృష్టం.. ఆ పేర్లు ఏంటంటే..!

భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లతో పిలుచుకోవడం నిషిద్ధం. దంపతులు కలిసి భోజనం కూడా చేయకూడదని ధర్మ శాస్త్రం చెబుతోంది. అలా కాదు అని కలిసి భోజనం చేస్తే ఆయుష్షు తగ్గే ప్రమాదం కూడా ఉందని వివరిస్తోంది. సాధారణంగా మన కంటే పెద్ద వారిని పేరు పెట్టి పిలవకూడదు. భార్యాభర్తల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. తన కంటే పెద్దవాడైన భర్తను భార్య పేరు పెట్టి పిలిస్తే పతివ్రత నియమాలు ఉల్లంఘించినట్లవుతుంది.

అయితే పూర్వ కాలంలో భార్యలు తమ భర్తలను స్వామి లేదా నాథ అని పిలిచేవారు. ఇప్పుడు అలా పిలవకపోయినా ఏవండీ అని పిలిచినా మంచిదే. ఏవండీ, స్వామి అనే రెండు పేర్లతో భర్తను భార్య ప్రతిరోజు పిలవడం వల్ల అదృష్టం ఇంట విలసిల్లుతుందని శాస్త్రం చెబుతోంది. భర్త విషయానికొస్తే తన భార్యను అతను ఎలాగైనా పిలవచ్చు. పేరు పెట్టి పిలిచినా తప్పేం లేదు. పూర్వకాలంలో ఒసేయ్, ఏమోయ్ అని పిలిచే వారు. పేరు పెట్టి పిలిస్తే అంత ప్రేమగా అనిపించదు కాబట్టి భర్త తన భార్యను ఒసేయ్, ఏమోయ్ అని పిలవడమే మంచిది.

పేర్ల విషయంలోనే కాదు ఇతర విషయాల్లో కూడా భార్య భర్తలు కొన్ని నియమాలు పాటించాలి. అదేంటంటే, భార్యాభర్తలు ఒకరికొకరు తమకు ఇష్టమైన వంట చేసుకుని తినాలి. ఇద్దరి కోసం వేర్వేరు వంటలు చేసుకుని వేరువేరు రుచులను ఆస్వాదించాలి. భార్యకు ఇష్టమైనది భర్త తినాలి. భర్తకు ఇష్టమైనది భార్య తినాలి. ఇలా ఇద్దరూ తమకు ఏది ఇష్టమైతే అది తినాలి.

అలాగే పడకగదిని కేవలం శృంగారానికి మాత్రమే పరిమితం చేయాలి. ఈ గదిలో వేరే విషయాలు చర్చించడం లేదా వేరే పనులు చేయడం నిషిద్ధం. ఆలుమగలు అన్న తర్వాత ఇరువురి తల్లిదండ్రులను గౌరవించడం చాలా ముఖ్యం. అలాగే ఇతర విషయాల్లో కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఏదైనా మనస్పర్ధలు ఏర్పడితే గొడవ పడకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి.