పెళ్లికి ముందు ప్రేమ.. భార్య భర్తల మధ్య పెళ్లి తర్వాత ఎందుకు త‌గ్గుతుంది…!

పెళ్లి.. ఇద్దరు వ్యక్తులు..ఏడడుగులు.. మూడు ముళ్ళు అంటే సరిపోదు .. ఇద్దరు వ్యక్తుల మనసులు.. ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపడినప్పుడే దానిని వివాహబంధం గా స్వీకరిస్తారు. ఇప్పటికీ మనం ఎన్నో జంటలను చూసే ఉంటాము.. పెళ్లికి ముందు ప్రేమించుకుని.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గా ఇష్టపడి.. చివరికి పెళ్లి అనే ఒక పదంతో వివాహ బంధంలోకి అడుగు పెడతారు.

ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిరువురు పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా ఉన్న.. పెళ్లి తర్వాత ఎందుకు అంతే ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఎన్నో జంటలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రేమ.. పెళ్లి చేసుకున్న వీరు చిన్న చిన్న ఒడిదుడుకులకు సర్దుకుపోలేక విడాకులు తీసుకుంటున్నారు. భార్య , భర్త మధ్య పెళ్లికి ముందు ఉన్న అన్యోన్యత అనురాగం వివాహం తర్వాత ఎందుకు ఉండడం లేదు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇకపోతే పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. పెళ్లి తర్వాత ఒక ఏడాది గడిస్తే ఈ ప్రేమానురాగాలు కనిపించవు. ముఖ్యంగా కొంతమందిలో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు.. భర్తలు ఏదైనా వండపెట్టమన్నా భార్యలు కసురుకుంటూ ఉంటారు. పరిస్థితి ఇలా మారిపోవడానికి గల కారణాలు ఏమిటో తెలియక చాలామంది జంటలు విడాకుల వరకు వెళ్తున్నాయి అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అంటే వివాహమైన కొత్తలో ఒకరి మీద మరొకరికి ఎక్కువ అంచనాలు ఉంటాయి.ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మరొకరు చాలా ఆరాట పడుతూ ఉంటారు. పిల్లలు జన్మించిన తర్వాత ఇద్దరూ కూడా పిల్లలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఒకరిపై మరొకరికి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుంది. వివాహానికి ముందు ఒకరి గురించి మరొకరికి తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు. కానీ వాళ్ల గురించి తెలుసుకున్న తర్వాత వారి లక్షణాలను బట్టి దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది.

చాలామంది వివాహానికి ముందు వారి అందం చూసి వ్యామోహం చెందితే వివాహం తర్వాత అది తగ్గిపోతుంది. ఇక పెళ్ళి తరువాత ఒకరికొకరు ఎంతో గౌరవంగా మర్యాదగా నడుచుకుంటారు.. కానీ కొద్ది రోజుల తర్వాత అదే గౌరవం కనిపించకపోతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఆచి తూచి అడుగులు వేస్తూ భార్య భర్తల మధ్య సామరస్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.