“విరాటపర్వం” రివ్యూ: సినిమా హిట్టా..ఫట్టా..?

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి..దగ్గుబాటి హీరో రానా కలిసి నటించిన చిత్రం “విరాటపర్వం”. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి, వివేదిత పేతురాజ్, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులు నటించారు. రొమాన్స్ సినిమాలు, కమర్షియల్ హిట్స్ కోసమే సినిమాలను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్లకు..విరాటపర్వం సినిమా తో మైడ్ బ్లాక్ చేశాడు వేణు. భారీ అంచనాల మధ్య నేడు ధియేటర్స్ లో రిలీజ్ అయిన..ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ హిట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు ఈ సినిమాను నిర్మిచారు. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో సాయి పల్లవి చెప్పిన్నట్లు..ఇలాంటి సినిమాలు మనం రేర్ గా చూస్తాం..కానీ, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో టోటల్ హీరో, హీరోయిన్ అంత సాయిపల్లవినే. ఈ సినిమా కి మెయిన్ ప్లస్ పాయింట్ ఆమె. ఈ వెన్నెల పాత్ర ఆమె కాకుండా ఎవ్వరు చేసినా సినిమాకి న్యాయం చేయలేరు. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది.

ఆ తరువాత ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్న రాసిన పుస్తకాలను చదువుతూ ఆయన మాటలకు ప్రేమలో పడిపోతుంది. అస్సలు ప్రేమ అంటే ఏమిటి అనేది..ఈ సినిమాలో డైరెక్టర్ కళ్ళకి కట్టిన్నట్లు బాగా చూయించారు. ఇంట్లో వాళ్ళు తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న క్రమంలో సాయి పల్లవి..రానా కోసం ఇంటి నుండి పారిపోతుంది. ఆ టైం లో ఆమె ఎదురుకున్న సమస్యలు ధియేటర్ కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడి కంట నుండి కన్నీరు తెప్పిస్తాయి. సినిమాలో సాయి పల్లవి నటన అధ్బుతంగా ఉంది. రానా తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమాకి కీ పాయింట్స్..ఇంట్రవెల్..సినిమా కధ మొత్తం ఛేంజ్ అయిపోతుంది. ఇక సినిమా లాస్ట్ చూస్తే ..అయ్యో పాపం అంటూ ఏడ్చేస్తారు. సినిమాలో ప్రతి డైలాగ్ సూపర్ గా ఉంటుంది. పాటలు కూడా చాలా బాగా కధకు సెట్ అయ్యాయి. ఓవర్ ఆల్ గా సినిమా సూపర్ సూపర్ హిట్ అని చెప్పుతున్నారు జనాలు. దీంతో సాయి పల్లవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిన్నట్లే అని అర్ధమైపోతుంది.

Share post:

Latest