వివాదంలో సాయి పల్లవి .. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!

సాయి పల్లవి.. గత రెండు రోజుల నుండి ఈ పేరు పై నెట్టింట ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఇన్నాళ్ళు ఆమె ఓ సూపర్ లేడి..పవర్ ఫుల్ లేడీ అంటూ ఓ రేంజ్ లో తెగ పొగిడేశారు. అమ్మడు లాంటి హీరోయిన్ దొరకదని..అదృష్ట దేవత అని..వామ్మో..ఓ దేవతలా చూసారు. సీన్ కట్ చేస్తే..ఒక్కే ఒక్క స్టేట్ మెంట్ తో..తన పరువు తానే తీసుకుంది అంటున్నారు జనాలు. విరాట పర్వం సినిమా లో భాగంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ ఇంటర్వ్యుల్లో సాయి పల్లవి మాట్లాడుతూ..కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో పండిట్ లను చంపడం పై..కొన్ని కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసింది. ఆ ఇంటర్వ్యుల్లో ఆ మాట్లాడుతూ..కశ్మీర్ పండిట్లపై నరమేధానికి పాల్పడిన టెర్రరిరిస్టులని పరోక్షంగా పవిత్రంగా పూజించే గోవుల్ని సంరక్షించే వారితో కంపేర్ చేస్తూ సాయి పల్లవి మాట్లాడింది అంటూ జనాలు ఆమె పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే ఆమె పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాయి పల్లవి పై నెట్టింట హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది.

రీసెంట్ గా ఈ ఇష్యూ పై సీనియర్ హీరోయిన్ విజయ శాంతి స్పందించారు. ఆమె మాట్లాడుతూ..హీరోయిన్ సాయి పల్లవి తాను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే మంచిదని..లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్‌స్ నే ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దానికి ఓ ఉదాహరణ చెప్పుతూ…తప్పు చేస్తే ఇంట్లో పిల్లాడిని అమ్మ కొట్టడం..డబ్బుని దొంగతనం చేసిన దోపిడీ దొంగ ను కొట్టడం..రెండు ఒక్కటే ఎలా అవుతాయి..సాయి పల్లవి..అవగాహన లేకుండా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికింది. దీంతో ఆమె సాయి పల్లవి పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular