సినీ ఇండస్ట్రీలో BUY 1 GET 1 ఆఫర్.. కొత్త పద్ధతి భలేగా ఉందే..!!

యస్..ఇప్పుడు ఇదే వార్త నెట్టింట ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మారుతున్న కాలానికి కొత్త పద్ధతులు చాలా నే అలవాటు చేసుకుంటున్నారు మన వాళ్ళు. మన సాంప్రదాయాని వదిలేసి..ఫారిన్ కల్చర్ కి అలవాటు డ్డారు నేటి తరం జనాలు . అలాగే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు అందరు. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఇది హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.

ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయితే చాలు..ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కానీ హీరో కానీ..ఆ సినిమా టీం కి, కో డైరెక్టర్స్ కి, సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కి గిఫ్ట్ లు ఇస్తున్నారు. సినిమాకి రెమ్యూనరేషన్ పాటికి రెమ్యూనరేషన్..మళ్ళీ ఎక్స్ ట్రా గిఫ్ట్..ఒక్కే దెబ్బకి రెండుపిట్టలు అన్నట్లు..ఒక్కే సినిమాకి రెండు సార్లు ఆదాయం వస్తుంది. ఈ లిస్ట్ లోకి చాలా మందే హీరోలు వస్తారు.

అప్పుడెప్పుడు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు…నిన్న వచ్చిన విక్రమ్ సినిమా వరకు..చాలా మంది హీరోలు ఈ సాంప్రదాయాని ఫాలో అవుతున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన పుష్ప సినిమా టైంలో “ఊ అంటావా మావ సాంగ్ ” త్వరగా షూట్ కంప్లీట్ చేశాడని..బన్నీ తన టీం మెంబర్స్ కి గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నిజానికి ఈ పద్ధతి కోలీవుడ్ హీరో సూర్య తీసుకొచ్చారు. ఆయన సింగం టైమ్ లో తన టీమ్ కు చిన్న చిన్న గిఫ్ట్ లు అందించాడు. ఆ తర్వాత డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి కూడా గ్యాంగ్ సినిమా టైములో కార్ కొనిచ్చారు.ఇక అప్పతి నుండి మిగతా హీరోలు కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ వస్తున్నారు. దళపతి విజయ్ అయితే బిగిల్ మూవీ టైమ్ లో దాదాపు ఆ సినిమాకి పని చేసిన 400 మందికి గోల్డ్ రింగ్స్ అందించాడు. మన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, మహేష్ కూడా లీ లిస్ట్ లో ఉన్నారు.

Share post:

Popular