ప‌వ‌న్ కెరీర్‌లో ఆ యేడాది అంత స్పెష‌లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని తెలుగోడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ సోదరుడు అయినప్పటికీ, తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఇతను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు.

అంతేకాకుండా ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవినే దాటిపోయే స్టార్ డం సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ ఏడాది చాలా ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. అదే 1998వ సంవత్సరం. ఆ ఏడాది 2 సంచలన సినిమాలతో పవర్ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

పవన్ మొదటి సినిమా 1996లో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం కొంచెం తేడా కొట్టినప్పటికీ 1997లో విడుదల అయినటువంటి ‘గోకులంలో సీత’ సినిమా యావరేజ్ గా ఆడింది. ఈ 2 సినిమాలు గుర్తింపు అయితే తీసుకు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ కోరుకున్న ఇమేజ్ మాత్రం దక్కలేదు. సరిగ్గా అలాంటి సమయంలో 1998 వ సంవత్సరం పవన్ కెరియర్ ని ఓ మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. ఆ సంవత్సరం ఆయన చేసిన 2 సినిమాలు బక్షాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

పవన్ కళ్యాణ్ స్టార్ డం ఓ మానియాలాగా తెలుగునాట వ్యాపించింది. అందులో ఒకటి భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించగా, మరొకటి కరుణాకరన్ తెరకెక్కించారు. ఇక ఆ సినిమాల పేర్లు ఏమిటో మీకు ఈపాటికే గుర్తుకు వచ్చేసి ఉంటుంది. అవును… ఏవ్ సుస్వాగతం, తొలిప్రేమ. ఈ రెండు సినిమాలతో ఓ జెనరేషన్ ని దాదాపు శాసించేసారు పవన్ కళ్యాణ్. అందువల్లనే ఈ 1998వ సంవత్సరం అనేది పవన్ కళ్యాణ్ కెరీర్లో చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది.