శ్రీదేవి కండీష‌న్ల‌తో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఇవే…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక హీరో చిరంజీవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరూ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సారి గా వచ్చిన చిత్రం మోసగాడు.. ఆ తరువాత రాణికాసుల రంగమ్మ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక 1980వ సంవత్సరంలో వీరిద్దరూ స్టార్ పొజిషన్లో ఉన్నారు.

ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రాకముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా ఒక సినిమా అయినా తీయాలని ఎంతో మంది డైరెక్టర్లు ప్రయత్నించగా.. అందులో ఒక చిత్రమే ఈ వజ్రాల దొంగ. ఈ సినిమాని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని శ్రీ దేవి స్వయంగా నిర్మిస్తానని చెప్పిందట. కానీ కథ దగ్గర కాస్త ఇబ్బంది పడడం తో తాను నిర్మాత కాబట్టి ఇందులో హీరో పాత్ర కంటే తన పాత్ర ఎక్కువగా ఉండాలని డిమాండ్ చేసిందట.

దాంతో చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత కొండవీటి దొంగ అనే సినిమాని తెరకెక్కించాలని చర్చలు జరుగుతూ ఉండేవట. ఇక ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి ఫిక్స్ కాగా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కథంతా విన్న తర్వాత శ్రీదేవి టైటిల్ మార్చమని అన్నదట.. దాని పేరే కొండవీటి రాణి కొండవీటి దొంగ అని.. అంతేకాకుండా తన పాత్రకి హీరో పాత్రకి సమానంగా ఉండేలా చూడాలని చెప్పిందట.

ఇక అంతే కాకుండా హీరో ప్రేమ ప్రేమ అంటూ తన చుట్టూ తిరగాలని కండీషను కూడా పెట్టిందట. దీంతో ఆ చిత్రం కూడా ఆగి పోవడం జరిగింది. దీని తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కి శ్రీదేవి పేచీ పెట్టింది. ముందుగా ఈ సినిమాకి జగదేక వీరుడు అనే టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీదేవి నో చెప్పడంతో అతిలోక సుందరి అనే టైటిల్ ని కూడా యాడ్ చేశారు. అలా శ్రీదేవి చేయడంతో పలు చిత్రాలు ఆగిపోయాయి.