ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్ష‌న్ ప‌డుతోందా..?

జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. నాయ‌కులు కూడా ఉన్నారు. ఏ నియోజ‌క‌వ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయ‌కులు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ యం ల‌క్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విష‌యంపై టీడీపీ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం.

అయితే.. ఈ రెండు జిల్లాల్లోని కీల‌క‌మైన నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌ట్టుకోల్పోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాను తీసుకుంటే.. స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌సారావు పేట నియోజ‌క‌వ‌ర్గాలు, కృష్ణాజిల్లాను తీసుకుంటే.. గ‌న్న‌వ‌రం, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారాయ‌ని తెలుస్తోంది. స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు శివ‌రామ‌కృష్ణ టికెట్ ఆశిస్తుండ‌గా.. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామ‌ని.. తాజాగా టీడీపీ స్థానిక నాయ‌కులు శ‌ప‌థం చేశారు.

ఇది పార్టీకి పెద్ద త‌ల‌నొప్పి తెచ్చి పెట్టింది. ఇక‌, న‌ర‌స‌రావుపేట టికెట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉన్న‌ప్ప టికీ.. వైసీపీని బ‌లంగా ఢీకొట్టే నాయ‌కుడు ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీ ఇబ్బందిగా మారాయి. మ‌రోవైపు.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రంగారావు కూడా స‌త్తెన‌ప‌ల్లిపై క‌ర్చీఫ్ వేసి కూర్చున్నారు. ఆయ‌న కు ఇక్క‌డ అంత ఫాలోయింగ్ లేద‌ని తెలుస్తోంది. ఇక‌, కృష్ణా జిల్లా విష‌యానికి వ‌స్తే.. గ‌న్న‌వరంలో ఇప్ప‌టి వ‌రకు పార్టీ న‌మ్ముకున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ జెండా మార్చేశారు.

దీంతో ఇక్క‌డ స‌రైన నాయ‌కుడు టీడీపీకి లేకుండా పోయార‌నేది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నాయ కుడి కోసం వెతుకుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ప‌ద్మ‌ను పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఆర్థికంగా పార్టీ సాయం చేస్తే.. త‌ప్ప‌.. ఆమె వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఓడిపోతే.. త‌న ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, గుడివాడ‌లో పాత‌త‌రం నాయ‌కులే క‌నిపిస్తున్నారు. కానీ, ఇప్పుడున్న కొడాలి నానితో ఢీ అంటే డీ అనే నాయ‌కుల అవ‌స‌రం ఉంద‌ని తెలుస్తోంది. కానీ, ఈ రేంజ్‌లో పోరాడే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి ఇబ్బందిగా మారాయ‌ని పెద్ద ఎత్ఉత‌న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.