భ‌ర్త‌తో ప్రేమ‌, పెళ్లిపై సుకుమార్ భార్య ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

పుష్ప పార్ట్ 1 సినిమా తర్వాత సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్‌గా అవతరించాడు. ఒకప్పుడు సుకుమార్ అంటే ఓ సాదాసీదా టాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సుకుమార్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఎవరూ లేరు. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సూపర్ హిట్ అయ్యాయి.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిలో పుష్ప మేనియాతో చాలా రోజుల పాటు కొనసాగింది అంటే అతిశయోక్తి కాదు. అయితే రీసెంట్ టైమ్స్ లో సుకుమార్ ఫ్యామిలీ కూడా లైమ్ లైట్ లోకి వస్తోంది. సుక్కు పుష్ప మూవీ ప్రచార కార్యక్రమాల్లో తన కూతురుతో పాటు భార్యను కూడా అందరికీ పరిచయం చేశారు. అప్పుడే సుకుమార్‌కి ఎంత చక్కటి ఫ్యామిలీ ఉందో అందరికీ తెలిసింది.

సుక్కు భార్య తబిత ఇప్పుడు సోషల్ మీడియాలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ కూడా తెచ్చుకుంటున్నారు. ఆమె గురించి ఇప్పటికే సుక్కు చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆమె లేకుంటే తాను లేనని బరువైన ఎమోషనల్ డైలాగ్స్ కూడా చెప్పాడు. అయితే నిన్న అనగా జూన్ 12న ఈ దంపతులు తమ 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుక్కు వైఫ్ ఒక స్వీటెస్ట్ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

“మన పెళ్లి రోజు కంటే నిన్ను నేను ఎక్కువగా మరే ఇతర రోజు ప్రేమించలేని అనుకున్నాను. కానీ మనం కలిసిన ప్రతి నిమిషం నా ప్రేమ మరింత బలపడుతోంది. నిన్ను నేను కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాను. మన ప్రేమ పట్ల నేను ప్రతిరోజూ కృతజ్ఞతా భావంతో ఉంటాను. ఒకరితో ఒకరు చాలా సార్లు… ప్రతిసారీ ప్రేమలో పడటమే మన వివాహం యొక్క విజయం అని నేను నమ్ముతున్నాను !! మన పెళ్లి బంధానికి 13 వసంతాలు నిండాయి. హ్యాపీ 13 ఇయర్స్ ఆఫ్ టుగెదర్‌నెస్ సుక్కు” అని సుకుమార్ సతీమణి తబిత ఒక స్వీట్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Share post:

Popular