టాలీవుడ్ లో కోటి పారితోషికంగా అందుకున్న తొలి హీరో ఎవరంటే..?

ఇటీవల కాలంలో కోటి అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది.. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే వారు సైతం అవలీలగా పొందుతున్నారు. ఒక సినిమా తెరకెక్కించారు అంటే సుమారుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతూ హీరోలకు అందులో రూ.150 కోట్లకు పైగా పారితోషికం కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే హీరోలు కూడా కోట్ల రూపాయల పారితోషికం కింద డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. కానీ అప్పట్లో కోటి రూపాయల పారితోషికం అంటే ఎంతో గగనంగా ఉండేది. ఎవరికి కూడా ఇంత డబ్బు ఇచ్చేవారు కాదు. వీరికి నెలవారీ చొప్పున ఒక కంపెనీ డబ్బులు ఇచ్చేది.

అలా తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటి సారి కోటి రూపాయలు అందుకున్న ఆ హీరో ఎవరో మనం ఎప్పుడు చదివి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు.. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా రాజకీయపరంగా ఎంతో మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు. నేటికీ తెలుగుదేశం పార్టీ కొనసాగుతోంది అంటే అది ఆయన చలవే అని చెప్పడంలో సందేహం లేదు. జానపద, పౌరాణిక, సాంఘిక వంటి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ రాముడు , కృష్ణుడు, యముడు వంటి పాత్రలలో లీనమై పోయి నటించేవారు.

ఇకపోతే ఈయన కూడా ఏ రోజు కూడా పారితోషికం విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టింది లేదు. నిర్మాతలు కూడా తమకు నచ్చిన పారితోషకం ఎన్టీఆర్ కి ఇచ్చేవారు. ఎన్టీఆరే పారితోషికం విషయంలో నోరు మెదపడం లేదు కాబట్టి మిగతా హీరోలు కూడా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు. కానీ ఎన్టీఆర్ చివరిసారిగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నటించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ఇక ఈ విజయాన్ని పురస్కరించుకొని తన అభిమాన హీరో కి మోహన్ బాబు ఏకంగా కోటి రూపాయలు పారితోషకం అలాగే బహుమతిగా ఇచ్చారట. ఆయన సినీ జీవితంలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు పారితోషికం కింద తీసుకోవడం జరిగింది.