ఆ కిక్కే వేరు బ్ర‌ద‌ర్..అతడికి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన రానా..!!

దగ్గుబాటి రానా..ఈ హీరో కమ్ విలన్ గురించి..ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడటం..ఈయనకు అలవాటు . అలా అని ఎవ్వరిని హర్ట్ చేయడు. తనని దిగజార్చే మాటలు అన్నాకూడా రానా సైలెంట్ గా తనదైన స్టైల్ లోనే కూల్ గా ఆన్సర్ ఇస్తుంటాడు. అలా చాలా సంధర్భాలల్లో జరిగినవి మనం చూశాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో రానా కి ఇలాంటి బ్యాడ్ క్వశ్చన్స్ ఎదురు అవుతుంటాయి.

గతం లో చాలా సార్లు రానా ని జనాలు ట్రోల్ చేశారు. హీరో అంటూ ఇండస్ట్రీకి హీరో గా వచ్చి విలన్ గా సెటిల్ అయ్యాడని..కొన్నాళ్ళు సినిమాకి గ్యాప్ తీసుకుంటే..రానా కెరీర్ అయిపోయిందని..భీబత్సంగా ఆడేసుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రానా ఎక్కువుగా ట్రోల్ అవుతుంది ఆయన నటించిన “విరాటపర్వం” సినిమా గురించే. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానీ వేణు ఊడుగుల డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న చిత్రంగా ఇప్పటికే మేకర్స్ చెప్పారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుండగా కరోనా వచ్చి రిలీజ్ వాయిదా పడింది. కాగా, అప్పటి నుండి ఈ సినిమా రిలీజ్ కు ఏదో ఒక్క సమస్య వస్తూనే ఉంది. ఫైనల్ గా సినిమాను జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి పోస్టర్స్, పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన పోస్టర్ లో రానా ముఖం క‌నిపించ‌కుండా.. అత‌డిని హ‌త్తుకుని ఉన్న సాయిప‌ల్ల‌వినే హైలైట్ చేస్తూ..మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

దీని పై ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. “ఛీ ద‌రిద్రం..నీ సొంత బేన‌ర్లోనే ఫేస్ క‌ట్ చేసే పోజీషన్ కి వచ్చేశావా. అంతేలే వాళ్ల సినిమాల్లో వీళ్ల సినిమాలో త‌క్కువ క్యారెక్ట‌ర్స్ చేయ‌డంతో అంద‌రికీ లోకువ అయిపోయావ్ రానా” అంటూ కామెంట్ చేశాడు. దీనికి రానా పగిలిపోయే రిప్లై ఇచ్చాడు. “మ‌నం త‌గ్గి హీరోయిన్ ను హైలెట్ చేయ‌డంలో ఉండే కిక్కే వేరు బ్ర‌ద‌ర్. నా సొంత బేన‌ర్ కాబ్బటే ఇక్కడ గొప్ప ప‌నులు చేయొచ్చు” అని పోస్ట్ చేసారు. దీంతో రానా ఇచ్చిన స‌మాధానంపై నెటిజన్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. నువ్వు సూపర్ రానా..నీలాంటి వాడే ఇండస్ట్రీకి కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

Share post:

Popular