# NBK 107 కోసం అఖండ సెంటిమెంట్‌నే న‌మ్ముకున్నారుగా…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ త‌ర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య హీరోగా తాజా చిత్రం రెడీ అవుతోంది. బాల‌య్య‌కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. క్రాక్ లాంటి బ్లాక్బ‌స్ట‌ర్ హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ భారీ చిత్రం భారీ యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది.

బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్త‌య్యింది. అయితే ఇంత‌లో స‌డెన్‌గా ఇప్పుడు బాలయ్యకు కరోనా రావడంతో చిన్నపాటి బ్రేక్ తీసుకుంది. బాల‌య్య ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్లో ఉన్నారు.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని అయితే వచ్చే వారం నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఇప్ప‌టికే ప్రి రిలీజ్ బ‌జ్ అదిరిపోగా… సినిమా రిలీజ్ పై కూడా లేటెస్ట్ గా మరింత స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అఖండ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ సినిమాను కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అది కూడా డిసెంబ‌ర్‌ మొదటి వారం లోనే ఉంటుంద‌ని టాక్.

జై బాల‌య్య టైటిల్ ప‌రిశీలిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

Share post:

Latest